ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మామ- అల్లుడి సినిమాకు ఓకే

ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. మామ- అల్లుడి సినిమాకు ఓకే
x
Prabhas New Movie
Highlights

బాహుబలి టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు మరో గుడ్ న్యూస్.

బాహుబలి టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు మరో గుడ్ న్యూస్. ప్రభాస్ మరో సినిమాను ఓకే చేశాడు. బాహుబలి తర్వాత భారీ బడ్జెట్‌తో వచ్చిన సాహో సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ప్రభాస్. ఆ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో ప్రభాస్ డీలా పడిపోయాడు. దీంతో తర్వాతి సినిమాల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వెస్తున్నాడు. అందుకు అనుగుణంగానే మహానటి సినిమాతో జాతీయ అవార్డును దక్కించుకున్న దర్శకుడు నాగ్ అశ్విన్ కథకు ఓకే చెప్పాడు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్విని దత్ నిర్మించనున్నారు. వైజయంతి మూవీస్ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభాస్ తో సినిమాను తీసుస్తున్నట్లు ప్రకటించింది.

ఈ చిత్రం విశేషాలు ఏంటంటే.. నాగ్ అశ్విన్ ఎవరో కాదు. స్వయానా అశ్విని దత్ అల్లుడు. ఇక అశ్విని దత్ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని అందుకు తగినట్లుగానే నాగ్ అశ్విన్ కథ సిద్దం చేశాడు. దీంతో సినిమాకు ప్రభాస్ ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే సినిమా పేరు ఏంటి? కథనాయక ఎవరు, ఇతర నటీనటుల పాత్రల్లో ఎవరు నటిస్తున్నారు? వంటి వివరాలు వెల్లడించలేదు. మరి కలిసి నాగ్ అశ్విని దత్, ప్రభాస్‌తో‎‎ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తారో చూడాలి.

ప్రస్తుతం ప్రభాస్ 'జిల్' దర్శకుడు రాధాకృష్ణతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. హీరోయిన్‌గా పూజా హెగ్డే నటిస్తున్నారు. 'రాధే శ్యాం', 'ఓ డియర్' అనే టైటిల్స్ అనుకుటున్నట్లు తెలుస్తోంది. ‎1930 కాలంలో ప్రేమకథ నేపథ్యంలో సినిమా తెరకెక్కుతోందని వార్తలు వస్తున్నాయి. రాధాకృష్ణ సినిమా పూర్తికాగానే నాగ్ అశ్విన్ సినిమాలో నటిస్తారు.




Show Full Article
Print Article
Next Story
More Stories