"ఆర్ ఆర్ ఆర్" సినిమాని కొనియాడుతున్న న్యూయార్క్ టైమ్స్

An Acclaimed RRR Movie from Hollywood
x

"ఆర్ ఆర్ ఆర్" సినిమాని కొనియాడుతున్న న్యూయార్క్ టైమ్స్

Highlights

"ఆర్ ఆర్ ఆర్" సినిమాని కొనియాడుతున్న న్యూయార్క్ టైమ్స్

Hollywood: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా "ఆర్ ఆర్ ఆర్" గురించి డిస్కషన్ లు నడుస్తున్నాయి. అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు కొమురంభీం పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించిన సినిమా "ఆర్ ఆర్ ఆర్". రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య మార్చ్ 25 న థియేటర్లలో విడుదలై బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. బాహుబలి 2 రికార్డులను సైతం బ్రేక్ చేస్తూ ఈ సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేవలం టాలీవుడ్ లో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది.

తాజాగా ప్రముఖ హాలీవుడ్ సంస్థ న్యూయార్క్ టైమ్స్ ఆర్ట్స్ కి సంబంధించిన నికోలస్ రపోల్డ్ ఈ సినిమాని ఆకాశానికి ఎత్తుతూ ప్రశంసల వర్షం కురిపించారు. బ్రిటిష్ కొలోనియల్ ఇండియా బ్యాక్ డ్రాప్తో సాగే ఎస్ ఎస్ రాజమౌళి ఆక్షన్ ఎపిక్ "ఆర్ ఆర్ ఆర్" ఒక అద్భుతం అంటూ సినిమా నికోలస్ సినిమాను కొనియాడారు. రామ్, భీమ్ పాత్రలో హీరోలు అద్భుతంగా నటించారని అన్న నికోలస్ ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు సూపర్ చార్జింగ్ గా ఉన్నాయని అన్నారు. దానికి "ఆర్ ఆర్ ఆర్" బృందం ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. ఇక హాలీవుడ్ నటులు ఒలీవియా మోరిస్, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడీ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపించిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories