"ఒరేయ్ నితిన్" అంటూ నితిన్ పై నిప్పులు చెరిగిన అమ్మ రాజశేఖర్

Amma Rajasekhar Sensational  Comments on Hero Nithiin | Tollywood News
x

"ఒరేయ్ నితిన్" అంటూ నితిన్ పై నిప్పులు చెరిగిన అమ్మ రాజశేఖర్ 

Highlights

"ఒరేయ్ నితిన్" అంటూ నితిన్ పై నిప్పులు చెరిగిన అమ్మ రాజశేఖర్

Amma Rajasekhar: ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ అమ్మ రాజశేఖర్ ఇప్పటికే తెలుగులో పలు సినిమాలకు దర్శకత్వం కూడా వహించారు కానీ ఇంకా తన కెరియర్ లో ఒక బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. తాజాగా "హై 5" అనే ఒక సినిమాకి దర్శకత్వం వహించారు. తానే స్వయంగా నిర్మించిన ఈ చిత్ర ఈవెంట్ కి హీరో నితిన్ ను పిలిచారు కానీ నితిన్ రాలేకపోవడంతో ఆ వేడుకలో మాట్లాడుతూ అమ్మ రాజశేఖర్ నితిన్ పై నిప్పులు చెరిగారు. "ఒకానొక సమయంలో నితిన్ కి అసలు ఎలా డాన్స్ చేయాలి అనేది కూడా తెలియదు.

కానీ మొదటి నుంచి నేను నేర్పించాను. నన్ను గురువుగా భావించి గౌరవిస్తాడని అనుకున్నాను కానీ ఇవాళ ఈవెంట్ కి పిలిచినా రాలేదు," అని అన్నారు రాజశేఖర్. "హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాక నితిన్ నన్ను ఇవాళ అవమానించాడు. తనకి ఇవాళ షూటింగ్స్ కూడా ఏమీ లేవు. కేవలం ఇంట్లో కూర్చున్నాడు. నీ గురువుని నువ్వు మర్చిపోతే నువ్వు ఎప్పటికీ సూపర్ స్టార్ వి కాలేదు. టెక్నీషియన్ విత్తనాలు అయితే ఆర్టిస్టులు ఫలాలు లాంటి వాళ్ళు. విత్తనాలే వృక్షాలు అయ్యి మంచి ఫలాలను ఇస్తాయి.

నువ్వు నాకు ఒక అబద్ధపు ప్రమాణం చేశావు. ఒరేయ్ నితిన్ నీ విషయంలో నేను చాలా డిసప్పాయింట్ అయ్యాను. నిన్ను నేను నమ్మాను. లైఫ్ లో నిన్ను ఎప్పుడైనా కలిస్తే మళ్ళీ అప్పుడు చూద్దాం," అని నితిన్ పై మండిపడ్డారు. అయితే మరోవైపు సినిమా ట్రైలర్ చూసిన అభిమానులు మాత్రం ఇలాంటి అడల్ట్ కంటెంట్ ఎక్కువగా ఉన్న సినిమా కాబట్టే నితిన్ అలాంటి సినిమాని ప్రమోట్ చేయడం ఇష్టం లేక వేడుకకి రాలేదని చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories