KBC 14: కౌన్‌ బనేగా కరోర్‌పతి షూటింగ్‌లో అభితాబ్‌కు గాయాలు

Amitabh Bachchan: ఇటీవలే 80వ పుట్టిన రోజు జరుపుకున్న బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్ బచ్చన్‌ షూటింగ్‌లో గాయపడ్డారు.

Arun Chilukuri
Published on: 23 Oct 2022 6:34 PM IST
Amitabh Bachchan Rushed To Hospital After Injury On The Sets KBC 14
X

KBC 14: కౌన్‌ బనేగా కరోర్‌పతి షూటింగ్‌లో అభితాబ్‌కు గాయాలు

Amitabh Bachchan: ఇటీవలే 80వ పుట్టిన రోజు జరుపుకున్న బాలీవుడ్‌ స్టార్‌ అమితాబ్ బచ్చన్‌ షూటింగ్‌లో గాయపడ్డారు. 80 ఏళ్ల వయస్సులో కూడా బ్యాక్‌ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఆయన తాజాగా కౌన్‌ బనేగా కరోర్‌పతి సీజన్‌-14 షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అందులో ఆయన కాలికి చిన్న ఇనుప ముక్క గుచ్చుకున్నది. దీంతో అమితాబ్‌కు తీవ్ర రక్తస్రావమైంది. వెంటనే షూటింగ్‌ యూనిట్‌ హుటాహుటిన అమితాబ్‌ను ఆసుపత్రికి తరలించారు.

అయితే గాయానికి కుట్లు వేసిన డాక్టర్లు యాంటిసెప్టిప్‌ మందులు ఇచ్చారు. కొంత కాలం నడవకూడదని డాక్టర్లు సలహా ఇచ్చారు. ఒత్తిడి కలగకుండా విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉన్నానని ఎలాంటి ఆందోళనా చెందొద్దని అభిమానులకు తన బ్లాగ్‌ ద్వారా బిగ్‌బీ తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు అమితాబ్‌ త్వరగా కోలుకోవాలని ఆ దేవుడ్ని ప్రార్థిస్తున్నారు. ఇటీవలే బ్రహ్మాస్త్ర, గుడ్‌ బై సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు అమితాబ్‌ బచ్చన్‌. మరోవైపు ప్రభాస్‌ హీరోగా నటిస్తోన్న ప్రాజెక్ట్‌ కే సినిమాలో కూడా నటిస్తున్నారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story