Amitabh Bachchan: వెళ్లాల్సిన సమయం వచ్చేసింది.. పోస్టు పై క్లారిటీ ఇచ్చిన అమితాబ్ బచ్చన్

Amitabh Bachchan Gives Clarity About His Retirement
x

వెళ్లాల్సిన సమయం వచ్చేసింది.. పోస్టు పై క్లారిటీ ఇచ్చిన అమితాబ్ బచ్చన్

Highlights

అమితాబ్ బచ్చన్ ఇటీవల తన ఎక్స్ ఖాతాలో వెళ్లాల్సి సమయం వచ్చేసింది అని పోస్ట్ చేశారు. ఆయన రిటైర్మెంట్ గురించి చెప్పారంటూ కథనాలు వెలువడ్డాయి.

Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్.. ఆయన పేరు ఓ బ్రాండ్. కొన్నాళ్ల క్రితం వరకు కేవలం హిందీలోనే నటించిన అమితాబ్.. ఇప్పుడు అన్ని భాషల్లోనూ ఒకే అంటున్నారు. 80 ఏళ్ల వయస్సులోనూ కుర్ర హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఆయన సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటారు. ఆన్‌లైన్ వేదికగా పలు అంశాలపై తన అభిప్రాయాన్ని పంచుకుంటూ ఉంటారు. ఆయన ఏ పోస్టు పెట్టినా క్షణాల్లో వైరల్ అవుతూ ఉంటుంది. ఇటీవల అమితాబ్ పెట్టిన పోస్టు ఎన్నో ఊహాగానాలకు తెరతీసింది. అమితాబ్ నటనకు గుడ్ బై చెప్పనున్నారనే ప్రచారం మొదలైంది. అయితే దీనిపై తాజాగా క్లారిటీ ఇచ్చారు అమితాబ్.

అమితాబ్ బచ్చన్ ఇటీవల తన ఎక్స్ ఖాతాలో వెళ్లాల్సి సమయం వచ్చేసింది అని పోస్ట్ చేశారు. ఆయన రిటైర్మెంట్ గురించి చెప్పారంటూ కథనాలు వెలువడ్డాయి. దీంతో అభిమానులు కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. మీరు ఎక్కడికి వెళ్తారు..? మమ్మల్ని ఆట పట్టించొద్దంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. దీనిపై స్పందించిన అమితాబ్ తాజాగా కౌన్ బనేగా కరోడ్‌పతిలో క్లారిటీ ఇచ్చారు.

వెళ్లాల్సిన సమయం వచ్చింది అని రాశాను. ఇందులో తప్పేముంది. నేను షూటింగ్‌కు వెళ్లాల్సిన సమయం వచ్చింది అని పోస్ట్ అర్థం. మీరు రాత్రి 2గంటలకు కూడా సరదా ప్రశ్నలు అడుగుతున్నారా..? నేను ఎప్పుడు ఇంటికి వెళ్లాలి. ఎప్పుడు నిద్ర పోవాలి అని నవ్వులు పూయించారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

80 ఏళ్ల వయస్సులోనూ అమితాబ్ స్టార్ హీరోలతో పోటీపడుతూ నటిస్తున్నారు. బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ప్రభాస్ కల్కి 2898 ఏడీలో అశ్వత్దామ పాత్రలో అదరగొట్టారు. ఇందులో బిగ్ బి నటనకి థియేటర్లు దద్దరిల్లాయి. అశ్వద్దామ అంటే ఆయనే గుర్తుచ్చేలా పెర్ఫార్మెన్స్ చేశారు. దీనితో పాటు రజనీకాంత్ వేట్టయాన్‌లోనూ న్యాయమూర్తి సత్యదేవ్‌‌గా మెప్పించారు. ప్రస్తుతం అమితాబ్ రామాయణంలో నటిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories