బింబిసార కంటే తక్కువ కలెక్షన్లు అందుకున్న అమిగోస్

Amigos Received Lesser Collections than Bimbisara
x

బింబిసార కంటే తక్కువ కలెక్షన్లు అందుకున్న అమిగోస్

Highlights

*అమిగోస్ కంటే ఎక్కువ కలెక్షన్లు అందుకున్న బింబిసార

Amigos: నందమూరి హీరో కళ్యాణ్ రామ్ తాజాగా "అమిగోస్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మధ్యనే "బింబిసార" సినిమాతో మర్చిపోలేని హిట్ అందుకున్న కళ్యాణ్ రామ్ తాజాగా ఇప్పుడు ఈ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. మూడు వదిన పాత్రలలో కనిపించిన కళ్యాణ్ రామ్ ఒక నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కూడా కనిపించారు. రాజేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒకేలా ఉండే వ్యక్తులు నిజజీవితంలో కలుసుకుంటే ఎలా ఉంటుంది అనే కాన్సెప్ట్ తో ఈ సినిమా కథ నడుస్తుంది.

అసికా రంగనాథ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది. మంచి అంచనాల మధ్య ఈ సినిమా ఫిబ్రవరి 10న థియేటర్లలో విడుదలైంది. విడుదలైన మొదటి రోజు నుంచి ఈ సినిమా పాజిటివ్ టాక్ ను అందుకుంది. కానీ కలెక్షన్ల పరంగా ఈ సినిమా అంతగా మెప్పించలేకపోయింది అని చెప్పుకోవాలి. మొదటి రోజున ఈ సినిమా కేవలం 4.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు మాత్రమే అందుకుంది. అయితే కళ్యాణ్ రామ్ "బింబిసార" సినిమా మొదటి రోజున ఈ సినిమా కంటే ఎక్కువ కలెక్షన్లు అందుకోవటం విశేషం.

బింబిసార సినిమా మొదటి రోజున 6.30 కోట్ల షేర్ ను రాబట్టింది. నైజాంలో 71 లక్షలు కలెక్షన్స్ అందుకున్న అమిగోస్ సీడెడ్ లో 29 లక్షలు, యూఏలో 23 లక్షలు, తూర్పు గోదావరిలో 18 లక్షలు, పశ్చిమ గోదావరిలో 10 లక్షలు, గుంటూరులో 31 లక్షలు, కృష్ణలో 13 లక్షలు, నెల్లూరులో 8 లక్షలు కలెక్ట్ చేసింది. ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 20 లక్షలు ఓవర్సీస్ లో 35 లక్షలు కలెక్ట్ చేసిన అమిగోస్ 4.65 గ్రాస్ ను నమోదు చేసింది. ఈ సినిమా బిజినెస్ 11.30 కోట్ల దాకా జరిగింది. కాబట్టి బ్రేక్ ఈవెన్ రావాలంటే 12 కోట్లు షేర్ రాబట్టాల్సి ఉంది.

Show Full Article
Print Article
Next Story
More Stories