సీన్ రివ‌ర్స్.. వ‌కీల్ సాబ్ వ‌ర్సెస్ జాతిర‌త్నాలు..ఫ‌న్నీ వీడియో

Vakeelsaab Vs Jathiratnalu
x

Vakeelsaab Jathiratnalu

Highlights

Jathi Ratnalu and Vakeel Saab Movie: వ‌కీల్ సాబ్ - జాతిర‌త్నాలు సినిమాలు ఈ ఏడాది విడుద‌లై ఎంత‌టి ఘ‌న‌విజ‌యం ద‌క్కించుకున్నాయో అంద‌రికి తెలిసిందే.

Jathi Ratnalu and Vakeel Saab Movie: వ‌కీల్ సాబ్ - జాతిర‌త్నాలు సినిమాలు ఈ ఏడాది విడుద‌లై ఎంత‌టి ఘ‌న‌విజ‌యం ద‌క్కించుకున్నాయో అంద‌రికి తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాల్లో కామన్ సీన్ కోర్టులో వ‌చ్చే స‌న్నివేశాలు. వ‌కీల్ సాబ్ లో కోర్టు సీన్స్ ప్రేక్ష‌కుల‌ను క‌న్న‌ర్ప‌కుండా చేశాయి. అద్యాంతం ఉత్కంఠ భ‌రితంగా సాగిన ఆ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను మెప్పించాయి. ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌ట‌న అద్భుతంగా ఉంటుంది. ముగ్గ‌రు యువ‌తుల‌కు న్యాయం కోసం ప‌వ‌న్ చేసే పోరాటం, వాదించే తీరు, సినిమాకే హైలెట్.

మ‌రో్ మూవీ జాతిర‌త్నాలు ఈ సినిమాలో కూడా కోర్టు సీన్ మాములుగా పండ‌లేదు. ఇందులో కూడా హీరో నవీన్ పోలిశెట్టితో పాటు అతని ఫ్రెండ్స్ ఇద్ద‌రు చేయ‌ని నేరానికి కోర్టు మెట్లు ఎక్కాల్సి వ‌స్తుంది. చివ‌ర్లో హీరో చెప్పె డైలాగ్స్ ప్రేక్ష‌కుల‌ను క‌డుపుబ్బ న‌వ్విస్తాయి. కోర్టులో త‌న కేసు త‌నే వాదించుకుంటూ జ‌డ్జి స‌హ‌నాన్ని ప‌రీక్షిస్తుంటాడు.

ఈ రెండు సినిమాల డిజిట‌ల్ ప్ర‌సార హ‌క్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో ద‌క్కించుకుంది. రెండు సినిమాలో ఇప్ప‌టికే అమెజాన్ లో స్ట్రీమ్ అవుతున్నాయి. అమెజాన్ తాజాగా తమ ట్విట‌ర్లో షేర్ చేసిన వీడియో న‌వ్వించ‌డం ఖాయంగా క‌నిపింస్తుంది. ఓ వైపు కోర్టు బోన్ లో న‌వీన్ పొలిశెట్టి ఉంటే.. మ‌రోవైపు లాయ‌ర్ పాత్ర‌లో ప‌వ‌న్ ఇద్ద‌రి మ‌ధ్య వాద‌న‌లు చూస్తే న‌వ్వ‌డం గ్యారెంటీ మీరు ఓ సారి ఈ వీడియో చూడండి.

మూడేళ్ల గ్యాప్ తర్వాత పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'వకీల్ సాబ్'. ఈ మూవీ ఏప్రీల్ 9న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. 'వకీల్ సాబ్' హిందీ సినిమా పింక్‌కు తెలుగు రీమేక్‌ అన్న సంగతి తెలిసిందే. భారీ అంచనాల నడుమ విడుదల అయినా ఈ సినిమాకు ఓపెనింగ్స్ అదిరిపోయే రేంజ్‌లో వచ్చాయి. అంజలి, నివేదా థామస్‌, అనన్య, ప్రకాశ్ రాజ్‌ కీలక పాత్రలు పోషించారు.

ఈ ఏడాది విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచి చిత్రాల్లో 'జాతి రత్నాలు'ఒకటి. నవీన్ పొలిశెట్టి, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో అనుదీప్ దర్శకత్వంలో రూపొందిన మూవీ 'జాతిరత్నాలు'. కామెడీ కామెడీ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 11న మహాశివరాత్రి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బాస్ట్రర్ హిట్ సాధించింది.


Show Full Article
Print Article
Next Story
More Stories