Tuck Jagadish Trailer Release: టక్ చెదరకుండా ట్రైలర్ తో వచ్చేసిన జగదీష్

Amazon Prime Released Tuck Jagadish Movie Trailer on 01 09 2021
x

 'టక్ జగదీష్' ట్రైలర్ విడుదల (ట్రైలర్ ఫోటో)

Highlights

* 'టక్ జగదీష్' ట్రైలర్ విడుదల

Tuck Jagadish Trailer: న్యాచురల్ స్టార్ నాని త్వరలో 'టక్ జగదీష్' సినిమాతో అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. మాస్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న నిర్మాతలు మాత్రం మంచి ఆఫర్ రావడంతో థియేటర్స్ లో కాకుండా ఓటీటీలో విడుదలకు మొగ్గు చూపారు. "మజిలీ", "నిన్నుకోరి" వంటి సూపర్ హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించిన శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ కొంతకాలం క్రితమే పూర్తయిపోయినప్పటికీ కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడుతూ వచ్చింది.

తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని చిత్ర యూనిట్ విడుదల చేసింది. విడుదలైన కొద్దిసేపట్లోనే మిలియన్ వ్యూస్ తో టక్ జగదీష్ యూట్యూబ్ లో ట్రేండింగ్ లో ఉంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గరపాటి, హరీష్ పెద్ది ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరించగా హీరో నానికి జోడిగా రీతూ వర్మ నటించగా ఎస్ ఎస్ తమన్ తన సంగీతాన్ని అందించాడు. టక్ జగదీష్ చిత్రాన్ని సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేసి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.



Show Full Article
Print Article
Next Story
More Stories