నాగార్జునతో మళ్లీ నటించడం పై అమల షాకింగ్ కామెంట్స్

Amala Shocking Comments on Acting Again With Nagarjuna
x

నాగార్జునతో మళ్లీ నటించడం పై అమల షాకింగ్ కామెంట్స్

Highlights

Amala Akkineni: నాగ్ తో మళ్లీ కలిసి నటించను అంటున్న అమల

Amala Akkineni: తెర వెనుక మాత్రమే కాకుండా వెండితెరపై కూడా టాలీవుడ్ కి నాగార్జున మరియు అమల అక్కినేని ల కాంబినేషన్ కు చాలామంది అభిమానులు ఉన్నారు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్లో బోలెడు సినిమాలు విడుదలయ్యాయి. అందులో చాలావరకు సినిమాలు బ్లాక్ బస్టర్లుగా కూడా నిలిచాయి. అయితే నాగార్జునతో పెళ్లి తర్వాత అమల చాలా కాలం సినిమాలకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ తరువాత ఒకటి రెండు సినిమాలలో కనిపించిన అమల ఈ మధ్యనే శర్వానంద్ హీరోగా నటించిన "ఒకే ఒక జీవితం" సినిమాలో శర్వానంద్ తల్లి పాత్రలో కనిపించి తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించారు.

అయితే తాజాగా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న అమల మళ్లీ నాగార్జునతో వెండితెరపై నటించే అవకాశం ఉందా అని అడగగా నో అని కరాకండిగా చెప్పేసారు అమల. "ఇంట్లో ఎలాగో కలిసే ఉంటాం కదా తెరపై కూడా ఎందుకు" అంటూ తెలివిగా సమాధానం ఇచ్చి తప్పించుకున్నారు అమల. ఒకవేళ అమలా నాగ్ నిజంగానే కలిసి కనిపించాలంటే భార్యాభర్తల పాత్రల్లోనే కనిపించాలి. కానీ అలాంటి కథలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. అందుకే అమల ముందే ఊహించి నో చెప్పేసారని కొందరు చెబుతున్నారు. మంచి పాత్రలు వస్తే మాత్రం నో చెప్పకుండా చేస్తాను అని మాత్రం హామీ ఇచ్చేశారు అమల.

Show Full Article
Print Article
Next Story
More Stories