Alludu Adhurs Movie Twitter review: సంక్రాంతి అల్లుడు ప్రేక్షకులను మెప్పించాడా?

బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన కొత్త సినిమా 'అల్లుడు అదుర్స్'. శ...
బెల్లంకొండ శ్రీనివాస్ ప్రధాన పాత్రలో సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన కొత్త సినిమా 'అల్లుడు అదుర్స్'. శ్రీనివాస్ జోడిగా నభా నటేష్, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటించారు. సుమంత్ మూవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై జి.సుబ్రహ్మణ్యం నిర్మించిన ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా ఈ గురువారం ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే గత రాత్రి ఓవర్‌సీస్‌లో ఈ మూవీ ప్రదర్శించ బడటంతో అక్కడి తెలుగు ఆడియన్స్ ట్విట్టర్ ద్వారా సినిమాపై అభిప్రాయలు తెలుపుతున్నారు.
రాక్షాసుడు వంటి బ్లాక్ బాస్టర్ తర్వాత శ్రీనివాస్ హీరోగా వస్తున్న సినిమా కావడంతో అంచనాలు పెరిగాయి. కాగా.. గురువారం విడుదల అయిన ఈ సినిమా అల్లుడు అదుర్స్ మూవీ క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనే టాక్ ఓవర్‌సీస్ నుంచి వినిపిస్తోంది. సంక్రాంతి అల్లుడి కామెడీ బాగానే పండిందని టాక్ వినిపిస్తోంది. దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ కాస్త స్లోగా నేరేట్ చేశాడని ట్వీట్స్ వస్తున్నాయి. యూఎస్ ప్రీమియర్ షోస్ ఆధారంగా మొత్తంగా చూస్తే ఈ సంక్రాంతి అల్లుడు మిశ్రమ స్పందన తెచ్చుకున్నాడనేది అర్థమవుతోంది. దేవీ శ్రీ బాణీలు మరోసారి మ్యాజిక్ చేస్తూ మ్యూజిక్ ప్రియులను ఆకర్షించాయని సమాచారం. మరి కొందరూ నెటిజన్లు సినిమా సాగతీత ఎక్కువగా ఉందని ఆభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమాలో సోనూ సూద్, ప్రకాష్ రాజ్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ కీలక పాత్రలు పోషించారు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. ఈ సినిమా ట్విటర్ రివ్యూను చుద్దాం.
it turns out to be a clean family entertainer though narration appears slow at times. Go and watch#AlluduAdhursOnJan14th #AlluduAdhurs
— Sai gadu (@NameisSai_) January 14, 2021
All The Best for #AlluduAdhurs
— Sasidhar (@Sasidhar96) January 14, 2021
My Opinion : #FLOP