అల్లు స్టూడియోస్‌ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్‌.. లాంఛింగ్‌కు ప్రత్యేక అతిథి..!

Allu Studios: అల్లు కుటుంబం వారు హైదరాబాద్ లో ఒక సినీ స్టూడియో నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే.

Arun Chilukuri
Published on: 26 Sept 2022 11:25 AM IST
Allu Studios to be Inaugurated on Oct 1st
X

అల్లు స్టూడియోస్‌ ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్‌.. లాంఛింగ్‌కు ప్రత్యేక అతిథి..!

Allu Studios: అల్లు కుటుంబం వారు హైదరాబాద్ లో ఒక సినీ స్టూడియో నిర్మాణం చేపట్టిన సంగతి తెలిసిందే. 'అల్లు స్టూడియో' పేరుతో లెజెండరీ నటుడు అల్లు రామలింగయ్య జయంతి సందర్భంగా రెండేళ్ల క్రితం దీని గురించి అధికారిక ప్రకటన చేశారు. గండిపేట వద్ద శంకుస్థాపన కూడా చేశారు. తాజాగా ఈ స్టూడియో నిర్మాణం ఎట్టకేలకు పూర్తయిందట. ఇక ఈ స్టూడియోని ప్రారంభించేందుకు ముహూర్తం కూడా ఖరారు అయ్యింది.

అల్లు రామలింగయ్య 100వ జయంతి సందర్భంగా అక్టోబర్ 1వ తేదీన ఈ స్టూడియోస్ ని ఘనంగా ప్రారంభించనున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్టూడియో లాంచ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారట. అయితే ఆసక్తికరమైన విషయం ఏమిటంటే స్టూడియోను మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తన చేతుల మీదుగా ప్రారంభిస్తారని సమాచారం.

ఇక స్టూడియోలో షూటింగ్ జరుపుకోనున్న మొదటి సినిమా అల్లు అర్జున్ నటించనున్న ''పుష్ప: ది రూల్'' అని తెలుస్తోంది. సినిమా షూటింగ్ లకు అన్నీ అత్యాధునిక సాంకేతిక సౌకర్యాలతో 10 ఎకరాల స్థలంలో "అల్లు స్టూడియోస్" విలాసవంతంగా నిర్మితమైంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరగా ఉండడం వల్ల స్టూడియో అందరికీ అందుబాటులో ఉంటుంది. ఇక బయటి వ్యక్తులకు అనుమతి లేకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తున్నారని తెలుస్తోంది.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story