Chiranjeevi: అల్లు కుటుంబంలో తాను భాగంకావడం నా అదృష్టం

హైదరాబాద్‎లో అల్లు స్టూడియోను ప్రారంభించిన చిరంజీవి

Rama Rao
Updated on: 1 Oct 2022 7:46 PM IST
Allu Studios launched by Megastar Chiranjeevi with the Allu Family
X

Chiranjeevi: అల్లు కుటుంబంలో తాను భాగంకావడం నా అదృష్టం

Chiranjeevi: అల్లు రామలింగయ్య కుటుంబంలో తాను భాగస్వామిని కావడం తన అధృష్టం అన్నారు మెగాస్టార్ చిరంజీవి. అల్లురామలింగయ్య జ్ఞాపకార్థం హైదరాబాద్ లో నిర్మించిన అల్లు స్టూడియోస్ ను నిర్మాత అల్లు అరవింత్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి ప్రారంభించారు. ఈసందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ మామయ్య అల్లు రామలింగయ్య శత జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళి అర్పిస్తున్నానని చెప్పారు.

ఈరోజు అరవింద్, బన్నీ, శిరీశ్, బాబీ సినీ రంగంలో ఉన్నత స్థానంలో కొనసాగుతున్నారంటే దశాబ్దాల క్రితం పాలకొల్లులో అల్లు రామలింగయ్య మదిలో మెదిలిన ఆలోచనే కారణమని చెప్పారు. నటనపై ప్రేమతో మద్రాసుకు వెళ్లి, సినీ పరిశ్రమలో మంచి స్థానానికి చేరుకోవాలని ఆయన అనుకున్నారని ఆ ఆలోచనే ఇప్పడు ఒక పెద్ద వ్యవస్థగా మారిందని అన్నారు. అందువల్ల అల్లు వారసులు ఆయనను ప్రతి క్షణం తలుచుకుంటూ ఉండాలని చెప్పారు. అల్లు కుటుంబంలో భాగం కావడాన్ని తాను అదృష్టంగా భావిస్తున్నానని చిరంజీవి చెప్పారు.

Rama Rao

Rama Rao

Next Story