అల్లు శిరీష్‌–నయనిక పెళ్లి తేదీ ఖరారు.. మార్చి 6న వివాహం

అల్లు శిరీష్‌–నయనిక పెళ్లి తేదీ ఖరారు.. మార్చి 6న వివాహం
x

అల్లు శిరీష్‌–నయనిక పెళ్లి తేదీ ఖరారు.. మార్చి 6న వివాహం

Highlights

టాలీవుడ్ నటుడు అల్లు శిరీష్‌ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు.

టాలీవుడ్ నటుడు అల్లు శిరీష్‌ త్వరలో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. తన ప్రియురాలు నయనికతో అక్టోబర్‌లో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్న శిరీష్‌, తాజాగా పెళ్లి తేదీని అధికారికంగా వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి 6న తమ వివాహం జరగనుందని తెలిపారు.

ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతున్న ఓ పాటకు అల్లు అయాన్‌, అర్హలతో కలిసి రీల్ చేస్తూ ఈ శుభవార్తను అభిమానులతో పంచుకున్నారు. ఆ సందర్భంగా ‘బాబాయ్‌ సంగీత్ ఎప్పుడు?’ అని వారు అడగగా, ‘మనం దక్షిణాది వాళ్లం… అలాంటివి చేసుకోం’ అంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చారు. అయితే పెళ్లి వేదిక ఎక్కడ అనేది మాత్రం ఇప్పటివరకు వెల్లడించలేదు.

మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. అల్లు అర్జున్‌–స్నేహారెడ్డి వివాహం కూడా 2011లో మార్చి 6న జరగడం విశేషం.

శిరీష్‌–నయనికల ప్రేమ కథ వరుణ్‌ తేజ్‌–లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకల సమయంలో మొదలైంది. ఆ వివాహానికి నటుడు నితిన్‌ తన భార్య షాలినితో కలిసి హాజరయ్యారు. షాలినితో పాటు ఆమె స్నేహితురాలు నయనిక కూడా అక్కడే ఉండగా, అప్పుడే తొలిసారి ఆమెను చూసినట్లు శిరీష్‌ తెలిపారు. ఆ పరిచయం స్నేహంగా మారి, క్రమంగా ప్రేమగా వికసించిందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

‘‘ఎప్పుడైనా మా పిల్లలు ‘మీ పరిచయం ఎలా మొదలైంది?’ అని అడిగితే ఇదే కథ చెబుతా. నన్ను తమ సర్కిల్‌లోకి తీసుకున్న నయనిక స్నేహితులందరికీ థాంక్స్‌’’ అని శిరీష్‌ తెలిపారు.

Show Full Article
Print Article
Next Story
More Stories