Allu Sirish Wedding: అల్లు శిరీష్-నయనిక ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్.. సందడి చేసిన బాలయ్య, నాగ్

Allu Sirish Wedding: అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ లో బాలకృష్ణ నాగార్జున సందడి
x

Allu Sirish Wedding

Highlights

Allu Sirish Wedding: అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ లో బాలకృష్ణ, నాగార్జున, నాని సందడి చేశారు

Allu Sirish: మెగా కాంపౌండ్‌లో పెళ్లి సందడి మొదలైంది. అల్లు అరవింద్ చిన్న కుమారుడు, టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ వివాహ వేడుకలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మార్చి 6న నయనికతో కలిసి శిరీష్ ఏడడుగులు వేయబోతుండగా, సోమవారం రాత్రి హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్ సినీ, రాజకీయ ప్రముఖుల సమక్షంలో కన్నుల పండువగా సాగింది.

ఈ వేడుకకు టాలీవుడ్ దిగ్గజాలందరూ తరలిరావడంతో అల్లు వారి ఇల్లు వెండితెరను తలపించింది.వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు 'నటసింహం'. కొత్త జంటను ఆశీర్వదించిన ఆయన, అల్లు అర్జున్‌తో కలిసి సరదాగా ముచ్చటించారు. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అక్కినేని నాగార్జున, మోహన్‌బాబు తమ కుటుంబ సభ్యులతో హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు.నాని, నాగచైతన్య వంటి యువ హీరోలు ఈ సంబరాల్లో పాలుపంచుకుని శిరీష్‌తో తమకున్న అనుబంధాన్ని చాటుకున్నారు.

ఎక్కడ ఉన్నా తనదైన శైలిలో నవ్వులు పూయించే హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఈ రిసెప్షన్‌లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. అతిథులందరినీ పలకరిస్తూ ఆయన చేసిన సందడి వేడుకకు కొత్త కళను తెచ్చింది.మరోవైపు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి చిత్ర దర్శకుడు అట్లీని ఈ వేడుక వేదికగా అందరికీ పరిచయం చేయడం విశేషం. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ప్రాజెక్ట్‌పై అంచనాలు పెంచేలా ఈ పరిచయం సాగింది.

అల్లు అర్జున్ తనయుడు అయాన్ చేసిన అల్లరి, సందడి వేడుకలో హైలైట్‌గా నిలిచింది. పెళ్లి పనుల్లో చురుగ్గా తిరుగుతూ, అతిథులతో ముచ్చటిస్తూ అచ్చం తండ్రిలాగే ఎనర్జిటిక్ గా కనిపించాడు అయాన్. అల్లు ఫ్యామిలీ అంతా ఒక్కచోట చేరిన ఈ వేడుక ఫోటోలు మెగా అభిమానులకు కనువిందు చేస్తున్నాయి.

సినిమా ఫంక్షన్‌లా కాకుండా, ఆత్మీయ అనుబంధాల కలయికలా ఈ రిసెప్షన్ సాగింది. ఇండస్ట్రీలోని పెద్దలందరూ ఒకే వేదికపైకి రావడం చూస్తుంటే అల్లు ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ ఏంటో అర్థమవుతోంది. మార్చి 6న జరగనున్న ప్రధాన వివాహ వేడుకకు మరిన్ని సర్ ప్రైజ్‌లు ఉండబోతున్నాయని సమాచారం. నయనిక - శిరీష్‌ల ఈ కొత్త ప్రయాణం విజయవంతం కావాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా విష్ చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories