Allu Arjun: ఏంటి అల్లు అర్జున్ ఆ హీరోయిన్‌‌ను బ్లాక్ చేశారా..?

Allu Arjun
x

Allu Arjun: ఏంటి అల్లు అర్జున్ ఆ హీరోయిన్‌‌ను బ్లాక్ చేశారా..?

Highlights

Bhanu Sri Mehra : టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ తిరుగుతున్న సోషల్ మీడియా వివాదాల గురించే చర్చ జరుగుతోంది.

Bhanu Sri Mehra: టాలీవుడ్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ తిరుగుతున్న సోషల్ మీడియా వివాదాల గురించే చర్చ జరుగుతోంది. '42 రూల్స్' అనే సంచలన ఆరోపణ నుంచి మొదలై, పాత వివాదాలు తెరపైకి రావడం వరకు.. బన్నీ ఇమేజ్‌పై నెట్టింట పెద్ద ఫ్యాన్ వార్ నడుస్తోంది. అల్లు అర్జున్ కెరీర్ పీక్స్‌లో ఉన్న వేళ, ఆయన వ్యక్తిత్వాన్ని టార్గెట్ చేస్తూ వచ్చిన ఒక ఆరోపణ టాలీవుడ్‌లో కలకలం రేపింది.

బ్రాండ్ స్ట్రాటజిస్ట్ కావేరి బారువా ఒక పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. బన్నీని కలవాలంటే 42 కఠినమైన నియమాలు పాటించాలి.. కళ్లలోకి చూడకూడదు.. హ్యాండ్‌షేక్ చేయకూడదు" అంటూ చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజేసాయి. ఈ ఆరోపణలపై బన్నీ ఆర్మీ తీవ్రంగా స్పందించింది. అల్లు అర్జున్ టీమ్ ఏకంగా డిఫమేషన్ కేసు వేస్తామని హెచ్చరించడంతో, ఫిబ్రవరి 15న కావేరి బారువా బేషరతుగా క్షమాపణలు చెప్పారు. తన వద్ద ఎలాంటి ఆధారాలు లేవని, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని ఆమె స్పష్టం చేయడంతో బన్నీ ఫ్యాన్స్ కాలర్ ఎగరేశారు.

23 ఏళ్ల కెరీర్‌లో ఎవరూ బన్నీని వేలెత్తి చూపలేదు.. కర్మ ఎప్పుడూ తిరిగి వస్తుంది అంటూ సోషల్ మీడియాను హోరెత్తించారు.అయితే, ఈ గెలుపు ఉత్సాహంలో ఉన్న ఫ్యాన్స్‌కు ఇతర హీరోల అభిమానులు గట్టి కౌంటర్ ఇస్తున్నారు. 2023లో జరిగిన 'వరుడు' హీరోయిన్ భాను శ్రీ మెహ్రా ట్విట్టర్ బ్లాక్ వ్యవహారాన్ని మళ్లీ వెలికి తీశారు. అప్పట్లో ఆమె సరదాగా చేసిన ట్వీట్ ఎంత రచ్చ చేసిందో అందరికీ తెలిసిందే.

నేను ఎప్పుడూ అల్లు అర్జున్‌ను నా కెరీర్‌కు బాధ్యుడిగా చెప్పలేదు. నా స్ట్రగుల్స్‌ను సరదాగా చెప్పాను అంతే. ఇప్పుడు ఆయన నన్ను అన్‌బ్లాక్ చేశారు అని స్పష్టం చేశారు. ఆరోపణలు ఎన్ని వచ్చినా.. తోటి నటులు, దర్శకులు మాత్రం బన్నీ చాలా డౌన్ టు ఎర్త్ అని మద్దతుగా నిలుస్తున్నారు. ప్రస్తుతం అపాలజీలు, కౌంటర్లతో సాగుతున్న ఈ సోషల్ మీడియా డ్రామా ఎటు దారితీస్తుందో చూడాలి. నిజం నిలకడగా తెలుస్తుందని బన్నీ ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories