జులై నుండి షూటింగ్ మొదలు పెట్టనున్న అల్లు అర్జున్

Allu Arjun Will Start Shooting Pushpa 2 in July
x

జులై నుండి షూటింగ్ మొదలు పెట్టనున్న అల్లు అర్జున్

Highlights

Allu Arjun: వచ్చే నెల నుండి బిజీ కాబోతున్న పుష్పరాజ్

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా "పుష్ప: ది రైజ్". ఎర్రచందనం బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీగానే కాసుల వర్షం కురిపించింది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక మిగతా భాషల్లో కూడా సినిమా పెద్ద విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా రెండవ భాగం అయిన "పుష్ప: ది రూల్" కూడా భారీ విజయాన్ని సాధిస్తుందని అభిమానులు మరియు దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. ఇక ఈ సినిమా గురించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

"పుష్ప: ది రూల్" షూటింగ్ వచ్చే నెల అనగా జులై ఎండింగ్ లో సెట్స్ పైకి వెళ్లనుంది. బన్నీ వాసు ఈ విషయాన్ని ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ప్రకటించారు. స్టార్ బ్యూటీ రష్మిక మందన్న ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ప్రముఖ మలయాళ నటుడు ఫాహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, సునీల్, తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories