చిన్న సినిమా చేయాలనుకుంటున్న అల్లు అర్జున్

Allu Arjun Wants to Make a Small Film | Tollywood
x

చిన్న సినిమా చేయాలనుకుంటున్న అల్లు అర్జున్

Highlights

చిన్న సినిమా చేయాలనుకుంటున్న అల్లు అర్జున్

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ మధ్యనే "పుష్ప: ది రైజ్" సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక హిందీ లో కూడా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో అందరి దృష్టి పుష్ప సినిమా రెండవ భాగమైన "పుష్ప: ది రూల్" పైనే పడింది. ఇక ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొనడం తో దర్శకుడు సుకుమార్ అంచనాలకు మించి సినిమా ఉండేలాగా ప్లాన్ చేస్తున్నారు.

ఈ నేపథ్యంలోనే స్క్రిప్టులో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్న సుకుమార్ ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టడానికి కనీసం రెండు మూడు నెలలు పడుతుందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా వచ్చే ఏడాది డిసెంబర్ కి విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఇంతకు ముందు "ఆర్ ఆర్ ఆర్" సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ "ఆచార్య" సినిమా షూటింగ్ కూడా పూర్తి చేసినట్లు అల్లు అర్జున్ కూడా ఇప్పుడు మరొక సినిమా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట.

ఇప్పటికే చాలా మంది స్టార్ డైరెక్టర్లు బన్నీతో సినిమా చేయడానికి లైన్లో ఉన్నారు కానీ అల్లు అర్జున్ మాత్రం తక్కువ సమయంలో పూర్తయిపోయే ఒక మంచి కథ కోసం వెతుకుతున్నారట. ప్యాన్ ఇండియన్ సినిమాలాగా కాకుండా తక్కువ రోజుల్లో పూర్తయ్యే ఒక మంచి చిన్న సినిమా అల్లు అర్జున్ కి దొరుకుతుందో లేదో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories