పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన అల్లు అర్జున్

Allu Arjun Visits Puneeth Rajkumar House
x

పునీత్ కుటుంబాన్ని పరామర్శించిన అల్లు అర్జున్

Highlights

Allu Arjun: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది అక్టోబర్ లో గుండెపోటు కారణంగా మరణించిన సంగతి తెలిసిందే.

Allu Arjun: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గత ఏడాది అక్టోబర్ లో గుండెపోటు కారణంగా మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నుంచి కూడా చాలా మంది సెలబ్రెటీలు బెంగళూరుకు వెళ్లి ఆయన కుటుంబాన్ని పరామర్శించి వచ్చారు. అయితే ఈ మధ్యనే పుష్ప సినిమా ప్రమోషన్స్ కోసం బెంగళూరు వెళ్ళిన అల్లు అర్జున్ ను పునీత్ రాజ్ కుమార్ ఇంటికి వెళ్తారా అని అడగగా తను బెంగళూరు కి వచ్చిన కారణం వేరని ఆ సమయంలో ఆయన కుటుంబాన్ని కలవడం సబబు కాదని తర్వాత మళ్ళీ వీలు చూసుకుని వచ్చి పునీత్ కుటుంబాన్ని కలుస్తానని అల్లు అర్జున్ చెప్పిన మాట అందరికీ తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే గురువారం ఫిబ్రవరి 3 న ఉదయం బెంగళూరు చేరుకున్న బన్నీ ముందుగా పునీత్ రాజ్ కుమార్ ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు పునీత్ రాజ్ కుమార్ హీరోగా నటించిన సినిమా "జేమ్స్" 17 ఫిబ్రవరి న విడుదల కాబోతోంది. మరోవైపు అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప" సినిమా తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక కన్నడలో కూడా బ్లాక్ బస్టర్ గా మారిన సంగతి తెలిసిందే.

Show Full Article
Print Article
Next Story
More Stories