"పుష్ప 2" తర్వాతే ఏదైనా అంటున్న అల్లు అర్జున్

Allu Arjun Says Anything After Pushpa 2
x

"పుష్ప 2" తర్వాతే ఏదైనా అంటున్న అల్లు అర్జున్

Highlights

Allu Arjun: అల్లు అర్జున్ కోసం క్యూ కడుతున్న స్టార్ డైరెక్టర్లు

Allu Arjun: నిన్న మొన్నటి దాకా తెలుగు రాష్ట్రానికి మాత్రమే పరిమితమైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజ్ "అలవైకుంఠపురంలో", "పుష్ప" వంటి బ్లాక్బస్టర్ సినిమాలతో ఇప్పుడు బాలీవుడ్ దాకా పాకింది. "పుష్ప" సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు బాలీవుడ్ లో కూడా అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. భారీ కలెక్షన్లతో అందరి దృష్టిని ఆకర్షించింది.

దీంతో హిందీ నుంచి కూడా అల్లు అర్జున్ కి ఆఫర్ల మీద ఆఫర్లు రావడం మొదలయ్యాయి. కానీ ప్రస్తుతం అల్లు అర్జున్ మాత్రం పుష్ప రెండవ భాగమైన "పుష్ప: ది రూల్" తో బిజీగా ఉన్నారు. ఈ సినిమాపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్న అల్లు అర్జున్ ఇప్పటికే రెండు హిందీ సినిమాలకు నో చెప్పినట్లు తెలుస్తోంది.

ఇక "పుష్ప: ది రూల్" సినిమా హిందీలో కూడా బ్లాక్ బస్టర్ అవుతుందని అభిమానుల తో పాటు ట్రేడ్ వర్గాలు కూడా విశ్వసిస్తున్నారు. మరోవైపు ఈ సినిమాలోని ఇతర పాత్రల కోసం సుకుమార్ ఆడిషన్స్ మొదలుపెట్టారు. ఇప్పటికే చాలా వరకు స్క్రిప్ట్ పని పూర్తయింది.

జూలై నుంచి ఈ సినిమా షూటింగ్ సెట్స్ పైకి వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు సంజయ్ లీలా బన్సాలీ, ప్రశాంత్ నీల్, లోకేష్ కనగరాజ్ వంటి స్టార్ డైరెక్టర్లు అల్లు అర్జున్ తో సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. కానీ "పుష్ప 2" సినిమా తర్వాతే అల్లు అర్జున్ తన తదుపరి సినిమా గురించి ఆలోచించనున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories