Allu Arjun-Rashmika: బ్లాక్‌బస్టర్ జోడీ రిటర్న్స్.. ఈసారి కెమిస్ట్రీ పూర్తి భిన్నం?

Allu Arjun-Rashmika: బ్లాక్‌బస్టర్ జోడీ రిటర్న్స్.. ఈసారి కెమిస్ట్రీ పూర్తి భిన్నం?
x

Allu Arjun-Rashmika: బ్లాక్‌బస్టర్ జోడీ రిటర్న్స్.. ఈసారి కెమిస్ట్రీ పూర్తి భిన్నం?

Highlights

టాలీవుడ్ అభిమానులకు అదిరిపోయే వార్త. బ్లాక్‌బస్టర్ మూవీ 'పుష్ప'తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అల్లు అర్జున్, రష్మిక మందన్న జోడీ మరోసారి వెండితెరపై కనిపించబోతోందని తెలుస్తోంది.

టాలీవుడ్ అభిమానులకు అదిరిపోయే వార్త. బ్లాక్‌బస్టర్ మూవీ 'పుష్ప'తో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అల్లు అర్జున్, రష్మిక మందన్న జోడీ మరోసారి వెండితెరపై కనిపించబోతోందని తెలుస్తోంది. తాజాగా రష్మిక AA22xA6 సినిమా షూటింగ్‌లో జాయిన్ కావడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మంగళవారం నుంచి ముంబైలో జరుగుతున్న షూటింగ్ షెడ్యూల్‌లో రష్మిక పాల్గొంటున్నారట. ఈ షెడ్యూల్ ఫిబ్రవరి 15 వరకు కొనసాగనుందని సమాచారం. ఆ తర్వాత ఆమె వ్యక్తిగత కారణాల వల్ల బ్రేక్ తీసుకోనున్నారు. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లో విజయ్ దేవరకొండతో ఆమె వివాహం జరగనున్న నేపథ్యంలో.. కొంత విరామం తీసుకుంటారని తెలుస్తోంది.

ప్రస్తుత షెడ్యూల్‌లో రష్మిక, అల్లు అర్జున్‌తో పాటు జాన్వీ కపూర్, జిమ్ సర్బ్‌ కీలక సన్నివేశాల్లో నటించనున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దాదాపు నెలరోజుల పాటు పూర్తిగా ఇండోర్‌లో జరుగనున్న ఈ షూటింగ్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, భావోద్వేగాలతో నిండిన డ్రామాటిక్ సీన్స్‌ను చిత్రీకరించనున్నారట. దర్శకుడు అట్లీ ఈ సినిమాను అత్యంత స్టైలిష్‌గా, పవర్‌ఫుల్ నెరేషన్‌తో తెరకెక్కిస్తున్నారని టాక్. పుష్ప తర్వాత రష్మిక, అల్లు అర్జున్‌ అధికారిక రీయూనియన్ కావడం విశేషం. అయితే ఈసారి వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ పూర్తిగా భిన్నంగా ఉండబోతోందని సమాచారం. ముఖ్యంగా రష్మిక నెగటివ్ షేడ్ ఉన్న పాత్రలో కనిపించనుండటం ఈ సినిమాకు మరో ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఆమె కెరీర్‌లోనే అత్యంత డేరింగ్‌, అన్‌కన్వెన్షనల్ పాత్ర ఇదేనని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకొణె ఎంపికైన సంగతి తెలిసిందే. ఇందులో మరో ఇద్దరు కథానాయికలకు అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అందులో ఒకరు జాన్వీ కపూర్ కాగా.. మృణాల్‌ ఠాకూర్‌ పేరు కూడా వినిపించింది. తాజాగా మృణాల్‌ ఈ విషయంపై స్పందిస్తూ అవన్నీ రూమర్స్ అని కొట్టిపారేశారు. ఇప్పుడు రష్మిక షూటింగ్‌లో జాయిన్ అయ్యారని న్యూస్ చక్కర్లు కొడుతోంది. దీనిపై చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. #AA22గా ప్రచారం పొందుతున్న ఈ చిత్రం అభిమానుల అంచనాలను మరింత పెంచేస్తోంది. అట్లీ మార్క్ మాస్, యాక్షన్, ఎమోషన్‌తో పాటు అల్లు అర్జున్ – రష్మిక కాంబినేషన్ మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమనే నమ్మకం ట్రేడ్ వర్గాల్లో కనిపిస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories