Allu Arjun: బన్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్ అదేనా..?

Allu Arjun Next Project Is With Atlee
x

 బన్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్ అదేనా..?

Highlights

అల్లు అర్జున్ నటించిన పుష్ప2 బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఆ భారీ విజయం తర్వాత బన్నీ నెక్ట్స్ మూవీ ఎవరితో చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.

Allu Arjun: అల్లు అర్జున్ నటించిన పుష్ప2 బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించిన విషయం తెలిసిందే. ఆ భారీ విజయం తర్వాత బన్నీ నెక్ట్స్ మూవీ ఎవరితో చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. అటు చిత్ర పరిశ్రమతో పాటు ఇటు ప్రేక్షకుల్లో దీనిపై చర్చ జరుగుతూనే ఉంది. త్రివిక్రమ్, అట్లీ ఇద్దరి కథలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బన్నీ. అయితే వీరిద్ధిరిలో ముందు ఎవరితో బన్నీ సినిమా చేయబోతున్నారన్నది ప్రస్తుతం చర్చ జరుగుతోంది.

సినీ వర్గాల సమాచారం ప్రకారం ముందు అట్లీ సినిమానే ఉంటుందని తెలుస్తోంది. వాస్తవానికి జవాన్ పూర్తయిన నాటి నుంచి బన్నీ కథపైనే దృష్టిపెట్టారు అట్లీ. ఆ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఇప్పటికే కంప్లీట్ అయిందని సమాచారం. ఇక త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ని మొదలెపెట్టనున్నారని టాక్.

అయితే సినిమా షూటింగ్‌కు ముందే బన్నీ దర్శకుడు అట్లీకి ఓ షరతు పెట్టారంట. వచ్చే ఏడాది మార్చి వరకు షూటింగ్ కంప్లీట్ చేయాలని చెప్పారంట. పాన్‌ ఇండియా సినిమా అంటూ సంవత్సరాల పొడవునా తీస్తే కుదరదని బన్నీ కరాఖండీగా చెప్పేశారని టాక్. స్క్రిప్ట్ ఇప్పటికే కంప్లీట్ కావడంతో బన్నీ షరతుకు అట్లీ ఓకే చెప్పేశారని సమాచారం. ఇక ఈ లోపు త్రివిక్రమ్ సినిమా స్క్రిప్ట్ వర్క్ పూర్తిచేసుకుని.. 2026 మార్చి తర్వాత సెట్స్‌కి వెళ్తుందని ఫిల్మ్ వర్గాల టాక్. ఈ సినిమాకు బన్నీ ఏడాదిన్నర డేట్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. వీటికి సంబంధించి అధికారిక ప్రకటనలు మాత్రం రాలేదు. ఇందులో నిజానిజాలు ఏంటి అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

బన్నీ పుష్ప2 తర్వాత ఎలాంటి సినిమా తీయబోతున్నారా అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి అట్లీ, త్రివిక్రమ్ తీయబోయే సినిమాలు బన్నీ పుష్ప2 రికార్డులను బ్రేక్ చేస్తాయా అనేది చూడాలి మరి.

Show Full Article
Print Article
Next Story
More Stories