బన్నీ, సుకుమార్ ఫస్ట్ లుక్ వచ్చేది అప్పుడే!

బన్నీ, సుకుమార్ ఫస్ట్ లుక్ వచ్చేది అప్పుడే!
x
Allu arjun, Sukumar
Highlights

ఈ ఏడాది సంక్రాంతికి అల వైకుంఠపురములో అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.

ఈ ఏడాది సంక్రాంతికి అల వైకుంఠపురములో అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు అల్లు అర్జున్.. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇది అల్లు అర్జున్ కి 20 వ సినిమా కావడం విశేషం..

ఇప్పటికే షూటింగ్ మొదలైన ఈ సినిమా కరోనా వైరస్ ప్రభావం వలన వాయిదా పడింది. అయితే ఇప్పుడు బన్నీ అభిమానులకు ట్రీట్ ఇవ్వడానికి సిద్దం అవుతుంది చిత్ర యూనిట్.. ఏప్రిల్ 08 న అల్లు అర్జున్ పుట్టిన రోజు కావడంతో సినిమా నుంచి ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసేందుకు సిద్దం అవుతున్నారట మేకర్స్.. ప్రస్తుతం దీనికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయని సమాచారం..

ఇక ఇందులో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ లుక్ లో కనిపించనున్నాడని, గంధపు చెక్కలు, స్మగ్లింగ్ నేపధ్యంలో ఈ సినిమా ఉంటుందని ప్రచారం సాగుతుంది. ఇందులో బన్నీ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోంది. సినిమాని దసరాకి బరిలోకి దింపేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక ఆర్య, ఆర్య2 సినిమాల తర్వాత బన్నీ, సుకుమార్ కాంబినేషన్ రీపీట్ అవుతుండడంతో సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories