దర్శకులకి గ్రాండ్‌పార్టీ ఇచ్చిన అల్లు అర్జున్

దర్శకులకి గ్రాండ్‌పార్టీ ఇచ్చిన అల్లు అర్జున్
x
అల.. వైకుంఠపురములో పార్టీ
Highlights

ల్లు అర్జున్ టాలీవుడ్ దర్శకుల అదిరిపోయే పార్టీ ఇచ్చారు. బన్నీ టాలీవుడ్ డైరెక్టర్లకు ఇచ్చిన పార్టీ సంబంధించిన ఫోటో తన ట్విటర్‌లో షేర్ చేశారు.

స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'అల.. వైకుంఠపురములో'.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్,గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మించారు. ఇందులో అల్లు అర్జున్ సరసన పూజా హేగ్దే కథానాయకగా నటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొని త్రివిక్రమ్,బన్ని కాంబినేషన్ లో హ్యట్రిక్ మూవీగా నిలిచింది.

సంక్రాంతికి రిలీజై 155 కోట్ల షేర్ బద్దలు కొట్టి అల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన ఈ సినిమా నైజాం, ఓవర్సీస్, కర్ణాటకలో తప్ప మిగిలిన అన్ని చోట్లలో ఇప్పటికే బాహుబలి ఫస్ట్ పార్ట్ కలెక్షన్లును దాటేసింది. ఇక ఈ ఆదివారం నైజాంలోనూ, ఓవర్సీస్ లోనూ బాహుబలి మొదటి పార్ట్ కలెక్షన్లను దాటేసి రేర్ ఫీట్ ని అందుకోనుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. హిందీ వర్షన్ లేకపోయినప్పటికీ రెండు వందల కోట్లును కలెక్ట్ చేసిన సినిమాగా అల.. వైకుంఠపురములో రికార్డు సృష్టించిందని చెప్పాలి.

ఈ నేపధ్యంలో అల్లు అర్జున్ టాలీవుడ్ దర్శకుల అదిరిపోయే పార్టీ ఇచ్చారు. బన్నీ టాలీవుడ్ డైరెక్టర్లకు ఇచ్చిన పార్టీ సంబంధించిన ఫోటో తన ట్విటర్‌లో షేర్ చేశారు. బన్నీ ఈ పార్టీలో టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు, త్రివిక్రమ్‌, నిర్మాత అల్లు అరవింద్‌తో పాటు దర్శకులు, యువ దర్శకులు, కో- డైరెక్టర్లు తహా పలువురు పాల్గొన్నారు.

ఇక సినిమా మంచి సక్సెస్ కావడంతో ఇప్పటికే చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో జరిగిన థాంక్స్ మీట్ లో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను షీల్డులతో సత్కరించి సంగతి తెలిసిందే. అంతేకాకుండా మొత్తం ఇండస్ట్రీకి గ్రాండ్ పార్టీ ఇచ్చారు. సెలబ్రేషన్స్‌లో ఎక్కడ కూడా తగ్గేది లేదని అల్లు అర్జున్ ఇప్పటికే చెప్పుకొచ్చాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories