బన్నీ ఫస్ట్ లుక్ పై టాలీవుడ్ స్టార్స్ అదిరిపోయే రెస్పాన్స్.. ఒకప్పుడు గోనగన్నారెడ్డి ట్వీట్స్

బన్నీ ఫస్ట్ లుక్ పై టాలీవుడ్ స్టార్స్ అదిరిపోయే రెస్పాన్స్.. ఒకప్పుడు గోనగన్నారెడ్డి ట్వీట్స్
x
Allu Arjun Look From Pushpa Movie
Highlights

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న‌ తాజా చిత్రం ‘పుష్ప’.

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న‌ తాజా చిత్రం 'పుష్ప'. ఈ సినిమా ఫస్ట్‌లుక్ బ‌న్ని పుట్టినరోజు సంద‌ర్భంగా టైటిల్‌, ఫ‌స్ట్ లుక్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ప్ర‌ముఖులు నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. బ‌న్ని స‌ర‌స‌న కథానాయికగా రష్మిక నటిస్తున్నారు. ఈ పొస్ట‌ర్ లో బన్నీ మాస్‌ లుక్‌లో విభిన్నంగా దర్శనమిచ్చారు. ఈ నేపథ్యంలో ఫస్ట్‌లుక్ అదిరిపోయిందంటూ ప్రముఖులు ట్వీట్లు చేశారు.

♦ సాయిధరమ్‌ తేజ్‌: దక్షిణాది స్టైలిష్‌ స్టార్‌ మా బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. 'పుష్ప' లుక్‌ చాలా నచ్చింది.

♦ గుణశేఖర్‌: ఒకప్పుడు గోనగన్నారెడ్డి.. ఆపై 'అల వైకుంఠపురములో..'లో బంటు.. ఇప్పుడు 'పుష్ప'. విభిన్నమైన పాత్రలతో అల్లు అర్జున్‌ తనను తాను కొత్తగా ఆవిష్కరిస్తున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలు బన్నీ.

♦ వి.వి. వినాయక్‌: ఎంతో శ్రమించే స్టైలిష్‌ స్టార్‌కు జన్మదిన శుభాకాంక్షలు. 'పుష్ప' చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు.


♦ శ్రీరామ్‌ ఆదిత్య: లుక్‌ కిక్కాస్‌గా ఉంది. పుట్టినరోజు శుభాకాంక్షలు బన్నీ.

♦ వెంకీ కుడుముల: హ్యాపీ బర్త్‌డే అల్లు అర్జున్‌ సర్‌. ఈ అద్భుతమైన లుక్‌ కోసం చాలా మారారు. సుకుమార్‌ విజన్‌ను ప్రశంసించాలి. మొత్తం చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు.

♦ బాబీ: 'పుష్ప' లుక్‌ అద్భుతంగా ఉంది. శ్రమించే తత్వం ఉన్న స్టైలిష్‌ స్టార్‌కు హ్యాపీ బర్త్‌డే.

♦ రత్నవేలు: పుట్టినరోజు శుభాకాంక్షలు అల్లు అర్జున్‌. మీకు ఈ ఏడాది గొప్పగా ఉండాలని కోరుకుంటున్నా. ఆల్‌ ది బెస్ట్‌.

♦ దేవిశ్రీ ప్రసాద్‌: ప్రియమైన 'పుష్ప'కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నా తరఫున, ట్విటర్‌లో చురుకుగా ఉండని మన సుకుమార్‌ తరఫున విష్‌ చేస్తున్నా. కీప్‌ రాకింగ్‌, డ్యాన్సింగ్‌, ఎంటర్‌టైనింగ్‌ బన్నీ బాయ్‌. 'పుష్ప' లుక్‌ అమేజింగ్‌గా ఉంది.

♦ శ్రీరామ్‌ ఆదిత్య: లుక్‌ కిక్కాస్‌గా ఉంది. పుట్టినరోజు శుభాకాంక్షలు బన్నీ.

♦ వెంకీ కుడుముల: హ్యాపీ బర్త్‌డే అల్లు అర్జున్‌ సర్‌. ఈ అద్భుతమైన లుక్‌ కోసం చాలా మారారు. సుకుమార్‌ విజన్‌ను ప్రశంసించాలి. మొత్తం చిత్ర బృందానికి నా శుభాకాంక్షలు.

♦ బాబీ: 'పుష్ప' లుక్‌ అద్భుతంగా ఉంది. శ్రమించే తత్వం ఉన్న స్టైలిష్‌ స్టార్‌కు హ్యాపీ బర్త్‌డే.

♦ మారుతి: జన్మదిన శుభాకాంక్షలు బన్నీ బాబు. నువ్వు ఎంత ఎత్తు ఎదిగినప్పటికీ మన స్నేహంలో ఎలాంటి మార్పు లేదు. నీకు మరిన్ని హిట్లు లభించాలని కోరుకుంటున్నా. మంచి స్నేహితుడు ఉంటే ఏదైనా సాధించవచ్చనే నమ్మకాన్ని నాకు ఇచ్చిన మా స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌కి థాంక్స్‌.


♦ గ‌తమన్‌: హ్యాట్రిక్‌ బ్లాక్‌బస్టర్‌ కొట్టాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్‌డే బ్రదర్‌. నువ్వు ప్రతి సినిమా కోసం కష్టపడుతూ వెళ్తున్న తీరుకు సాటిలేదు. సెట్‌లో నిన్ను ప్రతి క్షణం గమనించా. నీకు మరిన్ని విజయాలు చేకూరాలని కోరుకుంటున్నా.

♦ నిఖిల్‌: వావ్‌.. బన్నీ భాయ్‌ ఎప్పుడూ ది బెస్ట్‌తో మన ముందుకు వస్తారు. ఇంకో బ్లాక్‌బస్టర్‌ రాసిపెట్టుకోండమ్మా. పుట్టినరోజు శుభాకాంక్షలు అల్లు అర్జున్‌. శ్రమించే విషయంలో నువ్వు మా అందరికీ స్ఫూర్తి.

♦ రష్మిక: పుట్టినరోజు శుభాకాంక్షలు అల్లు అర్జున్‌ సర్‌. 'పుష్ప' లుక్‌ ప్రేక్షకులకు నచ్చిందని ఆశిస్తున్నా.

♦ హన్సిక: అద్భుతమైన వ్యక్తి అల్లు అర్జున్‌కు జన్మదిన శుభాకాంక్షలు. 'పుష్ప' ఫస్ట్‌లుక్‌ సూపర్‌గా ఉంది, ఆల్‌ ది బెస్ట్‌.

♦ అల్లు శిరీష్‌: హ్యాపీ హ్యాపీ బర్త్‌డే బన్నీ. చిన్నతనం నుంచి నువ్వు ప్రతి విషయంలోనూ నాకు స్ఫూర్తిగా నిలుస్తూ వచ్చావు. ఈ ఏడాది నీకు గొప్పగా ఉండాలని కోరుకుంటున్నా.






Show Full Article
Print Article
More On
Next Story
More Stories