బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో చేతులు కలపనున్న అల్లు అర్జున్

Allu Arjun Film With Bollywood Director Sanjay Leela Bhansali | Telugu Online News
x

బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో చేతులు కలపనున్న అల్లు అర్జున్

Highlights

*బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ తో చేతులు కలపనున్న అల్లు అర్జున్

Allu Arjun: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలలో అల్లుఅర్జున్ కూడా ఒకరు. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక ప్రపంచవ్యాప్తంగా బన్నీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అన్ని భాషల్లోనూ స్టార్ డైరెక్టర్లు అల్లు అర్జున్ తో ఒక సినిమా అయినా చేయాలని ఆశిస్తూ ఉంటారు. తాజా సమాచారం ప్రకారం ఒక స్టార్ బాలీవుడ్ డైరెక్టర్ ఇప్పుడు అల్లు అర్జున్ తో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఆయన మరెవరో కాదు ఈ మధ్యనే "గంగుభాయి కథియవాడి" సినిమాతో మంచి హిట్ అందుకున్న స్టార్ బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ. ఆలియాభట్ హీరోయిన్గా నటించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ఇప్పుడు 100 కోట్ల మార్కును దాటేసింది.

మరోవైపు "పుష్ప" సినిమాతో బాలీవుడ్ లో కూడా అల్లు అర్జున్ రేంజ్ బాగానే పెరిగింది. ఈ నేపథ్యంలో కథ బాగుంటే హిందీలో కూడా సినిమా చేయడానికి రెడీ అని అల్లు అర్జున్ ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పారు. తాజా సమాచారం ప్రకారం ముంబైకి పర్సనల్ పనిమీద వెళ్ళిన అల్లుఅర్జున్ సంజయ్ లీలా భన్సాలీ ఆఫీస్ కి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ త్వరలోనే సినిమా చేయబోతున్నారు అంటూ వార్తలు ఊపందుకున్నాయి. దేవదాస్, రామ్ లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన సంజయ్ లీలా భన్సాలీ అల్లుఅర్జున్ తో ఎలాంటి సినిమా చేయబోతున్నారని అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories