
Allu Arjun: 'పుష్ప'రాజ్ మామూలోడు కాదు..చిరంజీవితో సమానంగా అర్హత
Allu Arjun: సినిమా ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 'ఫిల్మ్‌ఫేర్' బ్లాక్ లేడీని ముద్దాడాలని ప్రతి నటుడు కలలుకంటాడు. తాజాగా టాలీవుడ్ చరిత్రలో ఒక అరుదైన రికార్డు నమోదైంది.
Allu Arjun: సినిమా ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 'ఫిల్మ్‌ఫేర్' బ్లాక్ లేడీని ముద్దాడాలని ప్రతి నటుడు కలలుకంటాడు. తాజాగా టాలీవుడ్ చరిత్రలో ఒక అరుదైన రికార్డు నమోదైంది. మెగాస్టార్ చిరంజీవి దశాబ్దాలుగా ఏకఛత్రాధిపత్యం వహించిన రికార్డును, ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సమం చేశాడు. ఈ ఇద్దరు స్టార్స్ మధ్య నెలకొన్న ఈ 'ఫిల్మ్‌ఫేర్' వార్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
తెలుగు చిత్ర పరిశ్రమలో రికార్డు అనే పదానికి చిరునామా మెగాస్టార్ చిరంజీవి. నటనలోనైనా, వసూళ్లలోనైనా, అవార్డులలోనైనా చిరు సృష్టించిన ప్రభంజనం అసామాన్యం. అయితే, ఇప్పుడు అదే మెగా వారసత్వాన్ని అందిపుచ్చుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తన మామ చిరంజీవి రికార్డును సమం చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
గతంలో అత్యధిక ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడు అవార్డులు అందుకున్న హీరోగా చిరంజీవి అగ్రస్థానంలో ఉండేవారు. అల్లు అర్జున్ ఆ లిస్టులో వెనకబడి ఉన్నప్పటికీ, 'పుష్ప: ది రైజ్' సినిమాతో అంతా మారిపోయింది. ఈ చిత్రంలో బన్నీ కనబరిచిన విశ్వరూపానికి ఫిదా అయిన జ్యూరీ, ఆయనకు ఏడోసారి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును ప్రకటించింది. దీంతో టాలీవుడ్‌లో అత్యధిక ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు అందుకున్న హీరోలుగా చిరంజీవి, అల్లు అర్జున్ ఇప్పుడు సమానంగా ఏడు అవార్డులతో అగ్రస్థానంలో నిలిచారు.
ఈ ఇద్దరు హీరోల గణాంకాలను పరిశీలిస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తాయి.మెగాస్టార్ చిరంజీవి ఇప్పటివరకు ఫిల్మ్‌ఫేర్ అవార్డుల కోసం 21 సార్లు నామినేట్ కాగా, అందులో 7 సార్లు బ్లాక్ లేడీని ఇంటికి తీసుకెళ్లారు. స్వయంకృషి, ఆపద్బాంధవుడు, ఇంద్ర వంటి సినిమాలతో ఆయన తన నటనా గరిమను చాటారు.ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బన్నీ కేవలం 13 సార్లు మాత్రమే నామినేట్ అయ్యారు. కానీ, స్ట్రైక్ రేట్ మాత్రం అమోఘం. ఆ 13 సార్లలోనే 7 సార్లు అవార్డును గెలుచుకున్నారు. పరుగైనా, వేదమైనా, రేసు గుర్రమైనా, పుష్పరాజ్ అయినా.. బన్నీ బ్రాండ్ ముద్ర పడాల్సిందే.
ఒకప్పుడు చిరంజీవిని చూస్తూ పెరిగిన అల్లు అర్జున్, ఈరోజు అదే మెగాస్టార్ రికార్డును తాకడం సినీ అభిమానులకు కనువిందుగా ఉంది. పుష్ప పార్ట్-2 (ది రూల్) కూడా రాబోతుండడంతో, బన్నీ త్వరలోనే ఎనిమిదో అవార్డుతో చిరంజీవిని దాటిపోతాడా? లేక మెగాస్టార్ తన తదుపరి సినిమాలతో మళ్ళీ లీడ్‌లోకి వెళ్తారా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




