Allu Arjun: తన హీరోయిన్ ని బ్లాక్ చేసిన అల్లు అర్జున్

Allu Arjun Blocked Varudu Movie Heroine Bhanu Sri
x

Allu Arjun: తన హీరోయిన్ ని బ్లాక్ చేసిన అల్లు అర్జున్

Highlights

Allu Arjun: ఫ్లాప్ సినిమా హీరోయిన్ ని బ్లాక్ చేసిన స్టార్ హీరో

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరియు భాను శ్రీ మెహ్రా కలిసి "వరుడు" సినిమాలో నటించారు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా అల్లు అర్జున్ ట్విట్టర్ లో భాను శ్రీ ని బ్లాక్ చేసినట్టు తెలుస్తోంది. గత కొంతకాలంగా భాను శ్రీ యూట్యూబ్లో కంటెంట్ క్రియేటర్ గా మారిపోయింది. ప్రేక్షకులను దృష్టిని ఆకర్షించడానికి సెలబ్రిటీల పేర్లు టాగ్ చేస్తూ వీడియోలు చేస్తూ వస్తోంది. తాజాగా ఇప్పుడు అల్లు అర్జున్ పేరుని డిస్కషన్ లోకి తీసుకొచ్చి భాను శ్రీ వార్తల్లో నిలిచింది.

"యాక్టర్ నుంచి కంటెంట్ క్రియేటర్ గా మారాను. ఎప్పుడో నా గత జన్మ మెమరీ లాగా మారిన వరుడు సినిమా హీరోయిన్ గా కంటే నేను ఇంకా ఎక్కువే అని నిరూపించుకోవాలనుకుంటున్నాను. నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫిలిం కెరీర్ కంటే నా యూట్యూబ్ వీడియోస్ ఇంకా ఎంటర్టైనింగ్ గా ఉంటాయని ప్రామిస్ చేస్తున్నాను," అని రాసుకొచ్చింది భాను శ్రీ. "ఎప్పుడైనా జీవితంలో ఆగిపోయాను అనిపిస్తే అల్లు అర్జున్ తో వరుడు సినిమాలో నటించానని కానీ అప్పటికి మళ్ళీ ఇలాంటి పని దొరకలేదని గుర్తు తెచ్చుకుంటాను.

కానీ ఇప్పుడు నా కష్టాల్లో కూడా కామెడీని వెతుక్కుంటున్నాను. ఎందుకంటే అల్లు అర్జున్ కూడా నన్ను ట్విట్టర్ లో బ్లాక్ చేశాడు," అని చెప్పింది. దీంతో ఒక నెటిసన్ "ఈమధ్య భాను శ్రీ ఒక బాట్ లాగా ప్రవర్తిస్తోందని" కామెంట్ చేశాడు. దానికి రిప్లై ఇస్తూ "ఇంతకుముందు ఎవరూ నన్ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పోల్చలేదు. దీనిని ఒక కాంప్లిమెంట్ గా తీసుకుంటాను అని చెప్పుకొచ్చింది. అయితే మరొక నెటిజన్ ఈమె కేవలం యూట్యూబ్లో సబ్స్క్రైబర్ల కోసమే ఇలా చేస్తోందని చెప్పగా భాను శ్రీ నెగటివిటీ ఇక తనను డౌన్ చేయలేదని, ఇప్పుడు తాను జీవితం లో సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చింది. ఇక ప్రతి చెత్త పోస్టులోనూ ట్యాగ్ చేస్తుంది అని అల్లు అర్జున్ ఈమెను బ్లాక్ చేసి ఉంటాడని ఫాన్స్ చెబుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories