అల..అమెరికాలో.. బన్నీ మహేష్ ను దాటేశాడు.. ఇక మిగిలింది రాంచరణ్!

అల..అమెరికాలో.. బన్నీ మహేష్ ను దాటేశాడు.. ఇక మిగిలింది రాంచరణ్!
x
అల.. వైకుంఠపురములో యూఎస్ రికార్డ్స్
Highlights

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకతంలో వచ్చిన చిత్రం అల.. వైకుంఠపురములో'..

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకతంలో వచ్చిన చిత్రం అల.. వైకుంఠపురములో'.. సంక్రాంతి సందర్భంగా విడుదలైన ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లో రికార్డు హిట్ సాధించింది. అంతే కాదు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు రికార్డులను అధిగమించింది.

అల.. వైకుంఠపురములో చిత్రంతో మహేష్ గత సినిమాల రికార్డును తిరగరాసేస్తూ.. తెలుగు సినీఇండస్ట్రీలోనే సరికొత్త చరిత్రను అల్లు అర్జున్ లిఖించారు. జులాయి, s/o సత్యమూర్తి సినిమాల తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అల.. వైకుంఠపురములో సూపర్ హిట్ సాధిచింది. అంతే కాదు వీరిద్దరి ఖాతాలో హ్యాట్రిక్ హిట్ నమోదు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తుంది.

మహేశ్ బాబు గత చిత్రం'భరత్ అనే నేను' సినిమా పేరిట ఉన్న రికార్డును అల్లు అర్జున్ బద్దలు కొట్టాడు. సంక్రాంతి సందర్భంగా విడుదలైన మహేశ్ 'సరిలేరు నీకెవ్వరు' కు గట్టి పోటీ ఇస్తునే అల.. వైకుంఠపురములో భారీ వసూళ్లు రాబట్టింది. 'అల.. వైకుంఠపురములో' USAలో ఇప్పటిదాకా 5వ స్థానం ఉంది. కాగా.. ఆదివారం‎ $3.42 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టి 4వ స్థానంలోకి ఎగబాకింది.

మహేశ్ బాబు 'భరత్ అనే నేను' చిత్రం నాలుగో స్థానం నుంచి5వ స్థానానికి పడిపోయింది. ఇక 3వ స్థానంలో ఉన్న రామ్ చరణ్ నటించిన సినిమా 'రంగస్థలం' $3.5 మిలియన్ మార్క్‌ని అధిగమించే విధంగా బన్ని‎ 'అల.. వైకుంఠపురములో' మూవీ ఉంది. ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. సీనియర్ నటి టబు, రాజేంద్రప్రసాద్, సుశాంత్, నివేతా పేతురాజ్, కీలక పాత్రల్లో నటించారు. గీత ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కలిసి నిర్మిచాయి. తమన్ సంగీతం అందించారు.

యూఎస్ మార్కెట్ లో ఉన్న టాప్ 5 తెలుగు సినిమాలు చూస్తే.

1. బాహుబలి 2: ది కన్ క్లూజన్ - $21 మిలియన్ డాలర్స్

2. బాహుబలి:ద బిగినింగ్- $16.8 మిలియన్ డాలర్స్

3. రంగస్థలం- $3.5 మిలియన్ డాలర్స్

4. అల.. వైకుంఠపురములో- $3.42 మిలియన్ డాలర్స్

5. భరత్ అనే నేను- $3.41 మిలియన్ డాలర్స్

Show Full Article
Print Article
More On
Next Story
More Stories