రామ్ చరణ్ చేతుల్లో పడ్డ అల్లు అర్జున్ సినిమా

Allu Arjun backs out of Venu Srirams Icon Movie
x

రామ్ చరణ్ చేతుల్లో పడ్డ అల్లు అర్జున్ సినిమా

Highlights

రామ్ చరణ్ చేతుల్లో పడ్డ అల్లు అర్జున్ సినిమా

ICON: వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా విడుదలైన "వకీల్ సాబ్" సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా మారిన సంగతి తెలిసిందే. కొన్నేళ్లపాటు సినిమాలకి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ కు వేణు శ్రీరామ్ ఈ సినిమాతో మర్చిపోలేని కం బ్యాక్ ఇచ్చారు. హిందీలో సూపర్ హిట్ అయిన "పింక్" అనే సినిమాకి రీమేక్ గా తెరకెక్కిన ఈ కోర్ట్ రూమ్ డ్రామాలో పవన్ కళ్యాణ్ ఒక లాయర్ పాత్రలో కనిపించారు.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయిన తర్వాత వేణు శ్రీరామ్ బన్నీ హీరోగా ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. నిజానికి పుష్ప సినిమా కంటే ముందు ఈ సినిమా పట్టాలెక్కాల్సి ఉంది. ఇప్పటికే ఈ సినిమాకి "ఐకాన్" అనే టైటిల్ ని కూడా ఖరారు చేశారు దర్శకనిర్మాతలు. కానీ అల్లు అర్జున్ మాత్రం ఎప్పటికప్పుడు ఈ సినిమా నీ వాయిదా వేస్తూ వచ్చారు. కథలో మార్పులు చేర్పులు చేయమని కోరుతూ బన్నీ ఈ సినిమాని చాలా కాలం వాయిదా వేశారు.

ఇక తాజాగా ఈ ప్రాజెక్టు క్యాన్సిల్ అయిపోయిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం అల్లు అర్జున్ నో చెప్పిన ఈ స్క్రిప్ట్ ఇప్పుడు మరొక మెగా హీరో చేతిలోకి వెళ్ళింది అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆ హీరో మరెవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అల్లు అర్జున్ "ఐకాన్" సినిమా కథను వేణు శ్రీరామ్ రామ్ చరణ్ కు వినిపించగా చెర్రీ ఈ సినిమాకి ఓకే చెప్పారట. అలా అల్లు అర్జున్ నో చెప్పిన కథ ఇప్పుడు చరణ్ చేతుల్లోకి వచ్చింది.

Show Full Article
Print Article
Next Story
More Stories