Allu Arjun: అతడు పాడుతుంటే సంగీతం అవసరంలేదు... అతడే ఓ సంగీతం

Allu Arjun Appriciates Singer Sid Sriram | Tollywood News
x

Allu Arjun: అతడు పాడుతుంటే సంగీతం అవసరంలేదు... అతడే ఓ సంగీతం

Highlights

Allu Arjun: అతడు పాడుతుంటే సంగీతం అవసరంలేదు... అతడే ఓ సంగీతం

Allu Arjun: టాలీవుడ్‌లో ప్రస్తుతం సిద్ శ్రీరామ్ మంచి ఫామ్ లో ఉన్నాడు. అతని పాడిన ప్రతి పాట హిట్ అవుతుంది. జనాల్లో అతని సాంగ్స్ కి పిచ్చ క్రేజ్ ఉంది. సిద్ అల్లుఅర్జున్ సినిమాల్లో వరుసగా పాడుతున్నాడు. ఇటీవల 'పుష్ప' సినిమాలో తను పాడిన శ్రీవల్లి పాట ఎంత ఫేమస్ అయిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా సిద్ ని అభినందిస్తూ తన సోషల్ మీడియాలో స్పెషల్ పోస్ట్ చేశాడు అల్లు అర్జున్. "నా సోదరుడు సిద్ శ్రీరామ్ పుష్ప ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో శ్రీవల్లి పాట పాడుతున్నాడు.

మ్యూజిక్ స్టార్ట్ అవ్వకముందే తను పాట పాడటం ప్రారంభించాడు. ఆ తర్వాత మెల్లగా మ్యూజిక్ స్టార్ట్ అవుతుందేమో అనుకున్నాను. కానీ మ్యూజిక్ స్టార్ట్ కాలేదు. తను మ్యూజిక్ లేకుండా పాడుతూనే ఉన్నాడు. నేను ఎంతో ఆశ్చర్యపోయాను. తన గొంతు చాలా మ్యాజికల్‌గా ఉంది. అప్పుడు నేను మనసులో అనుకున్నాను. తనకు సంగీతం అవసరం లేదు. తనే సంగీతం" అని ట్వీట్‌ చేసాడు


Show Full Article
Print Article
Next Story
More Stories