Allu Arjun: నాంపల్లి కోర్టుకు వర్చువల్ గా హాజరైన అల్లు అర్జున్

Allu Arjun Appear in Virtual Court Hearing in Sandhya Theatre Case
x

Allu Arjun: నాంపల్లి కోర్టుకు వర్చువల్ గా హాజరైన అల్లు అర్జున్

Highlights

అల్లు అర్జున్ (Allu Arjun) నాంపల్లి కోర్టుకు శుక్రవారం వర్చువల్ గా హాజరుకానున్నారు.

అల్లు అర్జున్ (Allu Arjun) నాంపల్లి కోర్టుకు శుక్రవారం వర్చువల్ గా హాజరుకానున్నారు. సంధ్య థియేటర్ (Sandhya Theatre) తొక్కిసలాట ఘటనలో రెగ్యులర్ బెయిల్ (Regular Bail) పిటిషన్ ను అల్లు అర్జున్ ఈ నెల 24న పిటిషన్ దాఖలు చేశారు.

సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ కు విధించిన రిమాండ్ ఇవాళ్టితో పూర్తి కానుంది. దీంతో ఇవాళ ఆయనను కోర్టుకు హాజరు కావాల్సి ఉంది. అయితే వ్యక్తిగత కారణాలతో కోర్టుకు హాజరుకాలేనని అల్లు అర్జున్ కోర్టు ను కోరారు. వర్చువల్ గా విచారణకు హాజరయ్యేందుకు అనుమతివ్వాలని కోరారు. ఈ విషయమై ఆయన తరపు న్యాయవాదుల వినతిపై నాంపల్లి కోర్టు సమ్మతించింది. నాంపల్లిలోని 9వ కోర్టు ముందు అల్లు అర్జున్ వర్చువల్ గా హాజరయ్యారు.

అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు సమయం కోరిన చిక్కడపల్లి పోలీసులు

డిసెంబర్ 4న జరిగిన సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో హైకోర్టు అల్లు అర్జున్ కు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.అయితే ఈ కేసులో రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించాలని హైకోర్టు డిసెంబర్ 13న ఆదేశించింది.ఈ ఆదేశాల నేపథ్యంలో అల్లు అర్జున్ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ పై చిక్కడపల్లి పోలీసులను కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు ఆదేశించింది. పోలీసులు దాఖలు చేసిన కౌంటర్ పై ఇరువర్గాల వాదనలను కోర్టు వింటుంది. సంధ్య థియేటర్ తొక్కిసలాటకు (Stampede) పరోక్షంగా అల్లు అర్జున్ కారణమయ్యారని పోలీసులు ఆరోపిస్తున్నారు. కౌంటర్ దాఖలు చేయడానికి చిక్కడపల్లి పోలీసులు సమయం కోరారు. దీంతో ఈ పిటిషన్ పై విచారణను వచ్చే ఏడాది జనవరి 10వ తేదీకి వాయిదా వేసింది కోర్టు.

Show Full Article
Print Article
Next Story
More Stories