Allu Arjun: ఇంట్రెస్టింగ్‌ కాన్సెప్ట్‌తో బన్నీ, అట్లీ సినిమా.. పూనకాలు రావడం ఖాయం

Allu Arjun and Atlees Upcoming Film A Massive Periodic Drama with Rebirth Concept
x

Allu Arjun: ఇంట్రెస్టింగ్‌ కాన్సెప్ట్‌తో బన్నీ, అట్లీ సినిమా.. పుణకాలు రావడం ఖాయం

Highlights

Allu Arjun: పుష్ప1, పుష్ప2 చిత్రాలతో ఒక్కసారిగా నేషనల్‌ వైడ్‌గా స్టార్‌ హీరోగా ఎదిగాడు ఐకాన్‌ స్టైల్‌ అల్లు అర్జున్‌.

Allu Arjun: పుష్ప1, పుష్ప2 చిత్రాలతో ఒక్కసారిగా నేషనల్‌ వైడ్‌గా స్టార్‌ హీరోగా ఎదిగాడు ఐకాన్‌ స్టైల్‌ అల్లు అర్జున్‌. అప్పటి వరకు స్టైలిష్‌ స్టార్‌గా అభిమానులను ఉర్రూతలుగించిన బన్నీ పుష్పలో పూర్తి స్థాయి మాస్‌ లుక్‌లో కనిపించి అందరినీ మెస్మరైజ్‌ చేశాడు. వన్‌ మ్యాన్‌ షోతో పుష్ప సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమాతో నార్త్‌లోనూ తన సత్తా ఏంటో చాటాడు.

దీంతో పుష్ప తర్వాత బన్నీ నటించే చిత్రంపై యావత్‌ ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీ దృష్టి పడింది. ఇందులో భాగంగానే తన తదుపరి చిత్రాలను భారీగా ప్లాన్‌ చేస్తున్నాడు బన్నీ. పుష్ప తర్వాత బన్నీ త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కాగా తమిళ దర్శకుడు అట్లీతో కూడా అల్లు అర్జున్‌ ఓ సినిమా చేయనున్నారు.

సన్‌ పిక్చర్స్‌ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రాన్ని పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఏప్రిల్‌ 8వ తేదీన వచ్చే అవకాశం ఉందని టాక్‌ నడుస్తోంది. కాగా తాజాగా ఈ సినిమా కాన్సెప్ట్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

వీటి ప్రకారం ఈ సినిమా పునర్జన్మ కాన్సెప్ట్ ఆధారంగా రూపొందనున్న భారీ పీరియాడిక్ డ్రామా అని తెలుస్తోంది. అల్లు అర్జున్ ఇందులో రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడని సమాచారం. వాటిలో ఒకటి యుద్ధ వీరుడిగా, మరొకటి ప్రస్తుత జనరేషన్‌కు చెందిన యువకుడి పాత్రలో కనిపించనున్నట్లు ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది.

ఈ చిత్రానికి భారీ స్థాయిలో విజువల్ ఎఫెక్ట్స్ ప్రాధాన్యం ఉండనుండగా, టాప్ టెక్నీషియన్లను ఈ ప్రాజెక్ట్ కోసం రంగంలోకి దింపనున్నట్లు సమాచారం. జులై లేదా ఆగస్టులో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉన్న ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహ్మాన్ లేదా అనిరుధ్ వ్యవహరించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరి ఈ సినిమా ఇండియన్‌ ఫిల్మ్‌ ఇండస్ట్రీలో ఎలాంటి వండర్స్‌ క్రియేట్‌ చేస్తుందో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories