స్టైల్‌గా ఉంది కదా నాకు కూడా నచ్చింది.. అల వైకుంఠపురములో టీజర్ రిలీజ్


టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, పూజా హెగ్దే కథానాయికగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అల వైకుంఠపురములో.
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా, పూజా హెగ్దే కథానాయికగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం అల వైకుంఠపురములో.. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ గురువారం విడుదలైంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్రానికి సంబంధించిన సామజవరగమన సాంగ్ ఓ రేంజ్ రికార్డు సృష్టించింది. కాగా.. తాజా విడుదలైన ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకునే రీతిలో రూపొదించారు. అల్లు అర్జున్ చెప్పే డైలాగ్ ఓ రేంజ్ లో పెలింది. స్టైల్ గా ఉంది కదా నాకు కూడా నచ్చింది. అంటూ బన్నీ చేప్పే డైలాగ్ ఆకట్టుకుంది ఇన్ని పాటలతో ప్యాక్ చేశాకా డైలాగ్ లేదనా అంటూ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. సంక్రాంతి సందర్భంగా ఈ చిత్రాన్నిజనవరి 12న రిలీజ్ చేస్తున్నామని సినిమా యునిట్ చెప్పిన సంగతి తెలిసిందే.
త్రివిక్రమ్ బన్ని కాంబినేషన్ అంటేనే అభిమానుల్లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గతంలో త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్నమూడో చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరి కలయికలో వచ్చిన జులాయ్, సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాలు భారీ విజయాలు నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. అల వైకుంఠపురములో సినిమాలో సుశాంత్, నివేదా పేతురాజ్స్ నవదీవ్, రాజేంద్రప్రసాద్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి తమన్ స్వరాలు అందిస్తున్నారు. అల్లు అరవింద్, రాథాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్నినిర్మిస్తున్నారు.
HMTV లైవ్ నుంచి తాజా వార్తా విశేషాల కోసం TELEGRAM ను అనుసరించండి!

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire



