Ala Vaikunthapurramloo: సైరాను వెనక్కి నెట్టిన బన్నీ.. ఇక మిగిలింది బాహుబలి రికార్డులే

Ala Vaikunthapurramloo: సైరాను వెనక్కి నెట్టిన బన్నీ.. ఇక మిగిలింది బాహుబలి రికార్డులే
x
సైరా నరసింహరెడ్డి , అల.. వైకుంఠపురములో
Highlights

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకతంలో వచ్చిన చిత్రం అల.. వైకుంఠపురములో'.. ఈ సినిమా తాజాగా మరో ఘనత సాధించింది.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకతంలో వచ్చిన చిత్రం 'అల.. వైకుంఠపురములో'.. సంక్రాంతి సందర్భంగా జనవరి 12న విడుదలైన ఈ సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లో ఆల్ టైం రికార్డు హిట్ సాధించింది. జులాయి, s/o సత్యమూర్తి సినిమాల తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. అంతే కాదు వీరిద్దరి ఖాతాలో హ్యాట్రిక్ హిట్ నమోదు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. రెండు వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా 213 కోట్ల సాధించి తెలగు చలన చిత్ర చరిత్రలోనే ఓ కొత్త వరవడి లిఖించింది.

ఇటీవలే యూఎస్ లో మహేశ్ బాబు గత చిత్రం'భరత్ అనే నేను' సినిమా పేరిట ఉన్న రికార్డును అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో..తో బద్దలు కొట్టాడు. తాజాగా ఈ సినిమా మరో వైలురాయికి చేరింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి సినిమా రికార్డులను బద్దలు కొట్టి ఆల్ టైం టాప్ 5 ఫిల్మ్స్ లో మూడో స్థానానికి చేరింది. మొదటి రెండు స్థానాల్లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి 2: ది కన్ క్లూజన్ ,బాహుబలి:ద బిగినింగ్ నిలవగా మూడోస్థానంలో బన్నీ సినిమా నిలిచింది. నాలుగో స్థానంలో చిరంజీవి సైరానరసింహ రెడ్డి, ఐదో స్థానంలో మెగా పవన్ స్టార్ నటించిన రంగస్థలం సినిమా నిలిచింది. కాగా.. టాప్ -5లో బాహుబలి తర్వాత వరుసగా మూడు చిత్రాలు మెగా కుటుంబాలకు చెందినవే కావడం విశేషం.

ఈ సినిమాలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. సీనియర్ నటి టబు, రాజేంద్రప్రసాద్, సుశాంత్, నివేతా పేతురాజ్, కీలక పాత్రల్లో నటించారు. గీత ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ కలిసి నిర్మిచాయి. తమన్ సంగీతం అందించారు.

భారీ వసూళ్లు సృష్టించిన టాప్ -5 తెలుగు సినిమాలను చూస్తే..

1. బాహుబలి 2: ది కన్ క్లూజన్ - రూ. 301 కోట్లు

2. బాహుబలి:ద బిగినింగ్- రూ.163 కోట్లు

3. అల.. వైకుంఠపురములో- రూ. 156 ( రెండు వారాల్లోనే)

4. సైరా నరసింహారెడ్డి - రూ. 147 కోట్లు

5. రంగస్థలం- రూ.132 కోట్లు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories