Allu Arjun ఖాతాలో మరో రికార్డు

Allu Arjun ఖాతాలో మరో రికార్డు
x
Highlights

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'అల వైకుంఠపురములో' .. సంక్రాంతి పండగ కానుకగా రిలీజ్ అయిన ఈ...

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం 'అల వైకుంఠపురములో' .. సంక్రాంతి పండగ కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతుంది. ఇప్పటికే నాన్ బహుబలి రికార్డులను బ్రేక్ చేసిన ఈ చిత్రం తాజాగా మరో రికార్డును అందుకుంది.

యూఎస్‌లో ఈ చిత్రం 3 మిలియన్ డాలర్ మార్క్‌ను అందుకుంది. అక్కడ అత్యధిక గ్రాస్ వసూలు చేసిన తెలుగు సినిమాల జాబితాలో 'అల వైకుంఠపురములో' ఐదో స్థానంలో ఉండగా, అంతకుముందు స్థానాలలో 21 మిలియన్ డాలర్లకు పైగా గ్రాస్ వసూలు చేసి బాహుబలి 2 మొదటిస్థానంలో ఉండగా ఆ తరవాత స్థానాలలో బాహుబలి, రంగస్థలం, భరత్ అనే నేను చిత్రాలు ఉన్నాయి. ఈ మార్క్‌ను అందుకోవడం అల్లు అర్జున్, త్రివిక్రమ్ కి ఇదే తొలిసారి...

ఇక ఈ చిత్రం విడుదలైన ఎనమిది రోజులలో ప్రపంచ వ్యాప్తంగా రూ.120 కోట్ల షేర్ వసూలు చేసింది.

నైజాం - రూ.31.2 కోట్లు

సీడెడ్ - రూ.14.64 కోట్లు

ఉత్తరాంధ్ర - రూ.14.38 కోట్లు

తూర్పు గోదావరి - రూ.8.39 కోట్లు

పశ్చిమ గోదావరి - రూ.6.72 కోట్లు

గుంటూరు - రూ.9.11 కోట్లు

కృష్ణా - రూ.8.49 కోట్లు

నెల్లూరు - రూ.3.38 కోట్లు

ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కలిసి ఈ చిత్రం 96.17 కోట్లు వసూళ్ళు చేసింది.

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రం కావడంతో సినిమాపైన మంచి అంచనాలు నెలకొన్నాయి. దానికితోడు తమన్ అందించిన పాటలు సినిమాపైన భారీ అంచనాలను క్రియేట్ చేసాయి. ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ , గీతా ఆర్ట్స్ కలిసి నిర్మించాయి. రాజేంద్రప్రసాద్, టబు, సుశాంత్, నివేతా పెతురాజ్ ముఖ్యపాత్రలు పోషించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories