డిజిటల్ మార్కెట్ మీద కన్నేసిన మెగా నిర్మాత

డిజిటల్ మార్కెట్ మీద కన్నేసిన మెగా నిర్మాత
x
Highlights

డిజిటల్ వెబ్సైట్ల పుణ్యమా అని ఈ మధ్య ప్రేక్షకులకు థియేటర్లకు వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని సినిమాలను హెచ్ డీ ప్రింట్ లో చూసే అవకాశం కలిగింది. చాలా వరకు...

డిజిటల్ వెబ్సైట్ల పుణ్యమా అని ఈ మధ్య ప్రేక్షకులకు థియేటర్లకు వెళ్ళకుండా ఇంట్లో కూర్చొని సినిమాలను హెచ్ డీ ప్రింట్ లో చూసే అవకాశం కలిగింది. చాలా వరకు అందరూ వినోదం కోసం ఈ డిజిటల్ వెబ్ సైట్ లనే ఎంచుకుంటున్నారు. అయితే వీటి వల్ల డిజిటల్ రైట్స్ అంటూ నిర్మాతలకు ఆదాయ మార్గాలు కూడా పెరుగుతున్నాయి. ఒకపక్క నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటివి డిజిటల్ ఫీల్డ్ లో దిగ్గజాలుగా నిలిస్తే ఈ మధ్యకాలంలో హాట్స్టార్, జీ ఫైవ్ ఇలాంటివి కూడా పాపులర్ అవుతున్నాయి. తాజాగా ఈ రంగంలోకి అడుగుపెట్టనున్నారు మెగా నిర్మాత అల్లు అరవింద్.

త్వరలో అల్లు అరవింద్ కూడా ఈ డిజిటల్ వెబ్సైట్ల పై దృష్టి పెట్టబోతున్నారట. ఇప్పటికే పెట్టుబడులు కూడా పెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. నిమ్మగడ్డ ప్రసాద్ మరియు మై హోమ్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు లతో కలిసి అల్లు అరవింద్ 150 కోట్లను పెట్టుబడిగా పెట్టేందుకు ముందుకు వచ్చారట. ప్రస్తుతం దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా బ్యాక్ గ్రౌండ్ వర్క్ మాత్రం శర వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తమ ఓటిటి సర్వీస్ లో కోసం కొన్ని సినిమా లను కూడా కొనడానికి సిద్ధమయ్యారు అల్లు అరవింద్.

Show Full Article
Print Article
Next Story
More Stories