స్టార్ హీరో తో వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న అల్లు అరవింద్

Allu Aravind Is Planning Web Series With Star Hero
x

స్టార్ హీరో తో వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్న అల్లు అరవింద్

Highlights

* ఓటీటీ లలో అడుగుపెట్టనున్న సీనియర్ హీరో

Nandamuri Balakrishna: ప్రస్తుతం చాలానే డిజిటల్ ప్లాట్ ఫామ్ లు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కానీ అందులో ఆహస్థానాన్ని మాత్రం ఎవరు బీట్ చేయలేరు. దానికి కారణం ఆహా ఎక్స్ క్లూజివ్ గా తెలుగు కంటెంట్ ఉండే ఓటీటీ. ఎన్నో సెలబ్రిటీ టాక్ షోలు వస్తున్నప్పటికీ నందమూరి బాలకృష్ణ హోస్ట్ చేసిన "అన్ స్టాపబుల్" షో కి మాత్రం సపరేట్ బేస్ ఉంది. నిజానికి ఈ షో కారణంగానే ఆహా పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగింది.

ఇప్పటికే ఈ షో కి సంబంధించి రెండు సీజన్లు చాలా సక్సెస్ ఫుల్ గా పూర్తయ్యాయి. ముఖ్యంగా రెండవ సీజన్ కి పవన్ కళ్యాణ్ ప్రభాస్ వంటి స్టార్లు కూడా ఈ షో కి విచ్చేశారు. అభిమానులు అందరూ ఈ షోకి సంబంధించిన మూడవ సీజన్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఈ షోకి ఉన్న క్రేజ్ కారణంగా ఆహా అధినేత అల్లు అరవింద్ బాలకృష్ణతో ఒక వెబ్ సిరీస్ తీస్తే బాగుంటుందని అనుకుంటున్నారట. ఇదే విషయాన్ని బాలయ్యకి చెప్పగా బాలకృష్ణ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇప్పటిదాకా తెలుగులో బ్లాక్ బస్టర్ అయినా వెబ్ సిరీస్ లో ఏమీ లేవు. ఒకవేళ ఆహా లో విడుదల అయ్యే బాలకృష్ణ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అయితే ఆహా కి ఇంకా తిరుగు ఉండదని చెప్పుకోవచ్చు. ఈ మధ్యనే వీర సింహారెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బాలకృష్ణ తాజాగా ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. మరి ఈ సినిమా తర్వాత బాలకృష్ణ ఓటీటీ లలో అడుగు పెడతారేమో చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories