బన్నీకి ఆల్‌టైం హిట్

బన్నీకి ఆల్‌టైం హిట్
x
Highlights

అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన అల వైకుంఠపురంలో.. సినిమా ఆదివారం విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తుంది.

అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన అల వైకుంఠపురంలో.. సినిమా ఆదివారం విడుదలై హిట్ టాక్‌తో దూసుకెళ్తుంది. అయితే ఈ సినిమా సక్సెస్ పై నిర్మాత అల్లు అరవింద్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సినిమాకంటే ముందు పాట "సామజవరగమన" విడుదల చేశామని అది పెద్ద సక్సెస్ అవుతుందనుకోలేదన్నారు. ఆ పాట ఇచ్చిన స్ఫూర్తితో మరో పాటను విడుదల చేశాం, అది కూడా మరిన్ని రికార్డులు సృష్టించిందన్నారు. తాజాగా ఆదివారం విడుదలైన చిత్రం కూడా బన్నీ కెరీర్‌లో ఆల్ టైం హిట్ సాంధించడం సంతోషంగా ఉందన్నారు. ఈ సినిమాను హిట్ చేసిన ప్రేక్షకులకు, అల్లు అర్జున్ అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

ఈ విడుదలైన కొన్ని గంటల్లోనే చిత్రం కలెక్షన్ల గురించి మాట్లాడడం లేదని, కొన్ని వార్తలు వచ్చాయి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో సినిమా కొన్న బయ్యర్లు సాయంత్రంలోగా లాభాల్లో పడ్డారని వార్తలు వచ్చాయని, ఆమెరికాలో తక్కువ థియేటర్లో విడుదలైన పెద్ద హిట్ అయిందని తెలిపారు. పూర్తి వివరాలు తర్వాత వెల్లడిస్తామని తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రిలీజ్ అయిన అల వైకుంఠపురంలో.. చిత్రం విజయం చేకూర్చి మరో పండగ ఇచ్చారని అల్లుఅరవింద్ అన్నారు.

హీరో అల్లు అర్జున్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ నుంచి వస్తున్న చిత్రం అల వైకుంఠపురములో... భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా ఈ సినిమాని ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో అలనాటి తార టబు రీఎంట్రీ ఇవ్వడం, తమన్ అందించిన పాటలకి మంచి క్రేజ్ రావడం, టీజర్, ట్రైలర్స్ లలో త్రివిక్రమ్ మార్క్ కనిపించడం సినిమాపైన భారీ అంచనాలను పెంచేసాయి. విడుదలైన అన్ని చోట్ల సినిమా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. టబు ఈ సినిమాతో రీఎంట్రీ ఇచ్చింది. సముద్రఖని, సుశాంత్‌, వెన్నల కిశోర్‌, నవదీప్‌, రాహుల్‌ రామకృష్ణ కీలక పాత్ర పోషించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories