Sarvesh Murari: సినిమాటోగ్రాఫర్ దర్శకత్వంలో నటించనున్న అల్లరి నరేష్

* సర్వేష్ మురారి నరేష్ తో ఒక డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ని ప్లాన్ చేస్తున్నారు

R Tripura Malini
Updated on: 16 Nov 2022 9:00 PM IST
allari naresh signed a new film with a cinemtographer
X

కొత్త సినిమా సైన్ చేసిన అల్లరి నరేష్

Allari Naresh: ఒకప్పుడు వరుస కామెడీ ఎంటర్టైనర్ సినిమాలతో సూపర్ హిట్ లు అందుకుంటూ మినిమం గ్యారంటీ హీరోగా మారిపోయిన అల్లరి నరేష్ ఆ తర్వాత వరుస డిజాస్టర్లు ఎదురవడంతో కొన్నాళ్ళు సినిమాల నుండి బ్రేక్ తీసుకున్నారు. చాలా కాలం తర్వాత ఈ మధ్యనే "నాంది" అనే ఒక సీరియస్ సినిమాతో హిట్ అందుకున్న నరేష్ తన నటనతో అందరి దృష్టిని ఆకర్షించాడు. తాజాగా ఇప్పుడు ఒక కొత్త డైరెక్టర్ తో చేతులు కలపనున్నారు అల్లరి నరేష్.

విక్రమార్కుడు, రగడ, పటాస్ వంటి హిట్ సినిమాలకు కెమెరామెన్ గా పని చేసిన సర్వేష్ మురారి ఇప్పుడు మెగాఫోన్ పట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్వేష్ అల్లరి నరేష్ హీరోగా ఒక సినిమా చేయబోతున్నారు. అయితే ప్రస్తుతం అల్లరి నరేష్ నటించిన "మారేడుమిల్లి ప్రజానీయం" సినిమా విడుదలకు సిద్ధమైయింది. ఆ సినిమా పక్కన పెడితే అల్లరి నరేష్ చేతుల్లో "సభకు నమస్కారం" అనే సినిమా మాత్రమే నరేష్ చేతిలో వుంది. అయితే ఈ సినిమా పనులు చాలా నెమ్మదిగా సాగుతున్నాయి.

అందుకే నరేష్ ఇప్పుడు కొత్త కథలపై ద్రుష్టి పెట్టారు. సర్వేష్ మురారి చెప్పిన కథ నరేషన్ బాగా నచ్చడంతో, దాదాపు ఈ కాంబినేషన్ సెట్ అయినట్టే అని చెప్పుకోవచ్చు. నాంది లాగా మారేడుమిల్లి కూడా సీరియస్ కథే. కానీ సర్వేష్ మురారి మాత్రం నరేష్ తో ఒక డిఫరెంట్ కమర్షియల్ ఎంటర్టైనర్ ని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇక త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన వెలువడనుంది. ఈ సినిమాతో నరేష్ ఎంత వరకు హిట్ అందుకుంటారో చూడాలి.

R Tripura Malini

R Tripura Malini

Next Story