మళ్లీ అలాంటి సినిమాలు చేయమని అల్లరి నరేష్ కి చెబుతున్న ఫ్యాన్స్

Allari Naresh Fans Are Giving Suggestions About Movies
x

మళ్లీ అలాంటి సినిమాలు చేయమని అల్లరి నరేష్ కి చెబుతున్న ఫ్యాన్స్

Highlights

* మళ్లీ అల్లరి నరేష్ ప్రేక్షకులను నవ్వించగలరా?

Allari Naresh: ఒకప్పుడు మినిమం గ్యారంటీ హీరోగా ఉంటూ కేవలం కామెడీ సినిమాల తోనే బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ సినిమాలను అందించిన అల్లరి నరేష్ కొంతకాలం పాటు వరుస డిజాస్టర్ లతో సతమతమయ్యారు. ప్రేక్షకులకి కామెడీ సినిమాలు బోర్ కొట్టేసిన సమయంలో సెల్ఫీ రాజా, బందిపోటు, సిల్లీ ఫెలోస్, సుడిగాడు వంటి సినిమాలతో నరేష్ డిజాస్టర్లు అందుకున్నారు. ఆ తర్వాత అల్లరి నరేష్ కామెడీ సినిమాలు పక్కన పెట్టి సీరియస్ రోల్స్ చేయటం మొదలుపెట్టారు. మహర్షి, నాంది, ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం వంటి సినిమాలలో సీరియస్ పాత్రలో నటించారు నరేష్.

తాజాగా ఇప్పుడు "ఉగ్రం" అనే సినిమాతో ప్రేక్షకులు ముందుకు రాబోతున్నారు. ఈ మధ్యనే విడుదలైన ఈ చిత్ర టీజర్ చూస్తే కూడా సినిమా చాలా సీరియస్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ సినిమాలు ఎలా ఉన్నా నరేష్ అభిమానులు మాత్రం అల్లరి నరేష్ మార్క్ కామెడీని బాగా మిస్ అవుతున్నారు. ఈ మధ్య మళ్లీ కామెడీ సినిమాలు బాగానే హిట్ అవుతున్నాయి. "జాతి రత్నాలు" వంటి సినిమాలు ఈమధ్య బాక్సాఫీస్ వద్ద బాగానే ఆడుతున్నాయి.

అసలు అలాంటి సినిమాలకి నాంది పలికిన అల్లరి నరేష్ కామెడీకి దూరమైపోవడం అభిమానులకు కొంత నిరాశ కలిగిస్తోంది. కొన్ని రోజులు అల్లరి నరేష్ సీరియస్ సినిమాలు పక్కన పెట్టి మళ్ళీ మంచి కామెడీ సినిమాలు తీస్తే బాగుంటుందని కొందరు చెబుతున్నారు. మరి అల్లరి నరేష్ ఇప్పటికైనా ఒక ఫుల్ లెన్త్ ఎంటర్టైనింగ్ పాత్రలో కనిపిస్తారా లేదా అని వేచి చూడాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories