ఎన్టీఆర్ సినిమా నుంచి తప్పుకున్న ఆలియా భట్

Alia Bhatt Says No to NTR Movie | Telugu Movie News
x

ఎన్టీఆర్ సినిమా నుంచి తప్పుకున్న ఆలియా భట్

Highlights

*ఎన్టీఆర్ సినిమా నుంచి తప్పుకున్న ఆలియా భట్

Alia Bhatt: బాలీవుడ్ స్టార్ బ్యూటీ అలియాభట్ ఈ మధ్యనే "ఆర్ఆర్ఆర్" సినిమాతో టాలీవుడ్ లో సైతం అడుగుపెట్టింది. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటించిన ఈ భామ తెలుగు ప్రేక్షకులను బాగానే మెప్పించింది. అయితే ఈ సినిమాలో ఆమెకి పెద్దగా ప్రాధాన్యత ఉన్న పాత్ర దొరకలేదని ఈ విషయంలో రాజమౌళి పై ఆలియా భట్ కోపంగా ఉందని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా మరోవైపు ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా నటించేందుకు సైన్ చేసింది ఆలియా. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయం గురించి స్వయంగా హింట్ ఇచ్చింది ఈ భామ.అయితే తాజా సమాచారం ప్రకారం ఆలియా భట్ ఈ సినిమా నుంచి తప్పకుందట. కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఆలియా ఈ సినిమా నుంచి తప్పుకుంది అని కొందరు చెబుతున్నారు.

అయితే కొందరు మాత్రం సౌత్ సినిమాలలో హీరోయిన్ లకి పెద్దగా ప్రాధాన్యత ఉండే పాత్రలు ఉండటం లేదని అలాంటి పాత్రలలో నటించిన ఇష్టంలేక ఆలియా ఈ సినిమా నుంచి తప్పకుంది అని చెబుతున్నారు. ముందుగా జాన్వికపూర్ రిజెక్ట్ చేసిన ఈ సినిమాని ఇప్పుడు ఆలియాభట్ కూడా తిరస్కరించడంతో అభిమానులు షాక్ అవుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories