అలియా భట్ మెచ్చిన తెలుగు హీరో

అలియా భట్ మెచ్చిన తెలుగు హీరో
x
అలియా భట్
Highlights

పెళ్లి చూపులు సినిమాతో హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యాడు హీరో విజయ్ దేవరకొండ.

పెళ్లి చూపులు సినిమాతో హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయ్యాడు హీరో విజయ్ దేవరకొండ.. ఆ తరవాత చేసిన అర్జున్ రెడ్డి సినిమా భారీ హిట్టు అయింది. ఈ ఒక్క సినిమాతో విజయ్ రేంజ్ పెరిగింది.. ఏకంగా సెన్సేషనల్ స్టార్ అయిపోయాడు విజయ్.. వచ్చిన క్రేజ్ ని కంటిన్యూ చేస్తున్నాడు విజయ్.. తాజాగా బాలీవుడ్‌ అందాల భామ అలియా భట్ 2019లో తన ఫేవరేట్ హీరో ఎవరు అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. అందరు బాలీవుడ్‌ హీరోలను పక్కన పెట్టి విజయ్‌ దేవరకొండకు పేరును చెప్పేసింది.

ఇటీవల ముంబైలో ఫిలిం ఫేర్‌ అవార్డ్స్‌ కార్యక్రమం జరిగింది. దీనికి బాలీవుడ్‌ స్టార్స్‌ అందరు హాజరై సందడి చేశారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముద్దుగుమ్మలను నిర్వాహకులు ఈ ఏడాది మీ ఫేవరెట్ స్టార్స్‌ ఎవరంటూ ప్రశ్నించారు. అందులో భాగంగా ఈ ప్రశ్న అలియా భట్‌కు కూడా ఎదురైంది. దీనితో అలియా భట్ తన ఫేవరెట్‌ హీరో విజయ్‌ దేవరకొండ అంటూ చెప్పుకొచ్చింది. విజయ్‌ దేవరకొండ మోస్ట్ గ్లామరస్‌ యాక్టర్‌` అంటూ చెప్పుకొచ్చింది. ఇక అనుష్క శర్మ తన ఫేవరేట్ నటి అని చెప్పుకొచ్చింది.

ప్రస్తుతం అలియా భట్ టాలీవుడ్ దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్.ఆర్.ఆర్ ( వర్కింగ్ టైటిల్ మాత్రమే) లో నటిస్తుంది. ఈ సినిమాలో అలియా రామ్ చరణ్ పక్కన సీత అనే పాత్రలో నటిస్తుంది. ఈ సినిమాని వచ్చే ఏడాది జులై 30 కి విడుదల చేయనున్నారు.

ఇక విజయ్‌ దేవరకొండ విషయానికి వస్తే వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ తర్వాత పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఫైటర్‌ అనే సినిమా చేయనున్నాడు. ఆ తరువాత తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై తెరకెక్కిస్తున్న హీరో సినిమాను పూర్తి చేయాల్సి ఉంది. వీటితో పాటు జయలలిత బయోపిక్‌ తలైవిలో శోభన్‌బాబు పాత్రలో నటించేందుకు విజయ్‌ ఓకె చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది .

Show Full Article
Print Article
More On
Next Story
More Stories