'సామజవరగమన' వీడియో సాంగ్ వచ్చిందోచ్

సామజవరగమన వీడియో సాంగ్ వచ్చిందోచ్
x
'అల.. వైకుంఠపురములో' ఫైల్ ఫోటో
Highlights

స్టైలిష్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'అల.. వైకుంఠపురములో' . పూజా హెగ్డే కథానాయికగా...

స్టైలిష్‌ స్టార్‌ అల్లుఅర్జున్‌ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం 'అల.. వైకుంఠపురములో' . పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజైన బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అయితే సినిమా విడుదలకి ముందే తమన్ అందించిన పాటలు బిగ్గెస్ట్ హిట్ గా నిలిచాయి. ముఖ్యంగా సామజవరగమనా, రాములో రాములా పాటలు యూట్యూబ్‌లో ఓ ట్రెండ్‌ క్రియేట్‌ చేశాయి.

అయితే తాజాగా ఈ సినిమా నుంచి 'సామజవరగమన' ఫుల్‌ వీడియో సాంగ్ విడుదల చేశారు. ఈ పాట సినిమా విడుదల చేసిన నటినుంచి సంగీత ప్రీయులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాగా... 'సామజవరగమన' లిరికల్‌ సాంగ్‌ను విడుదల చేసిన కొన్ని గంటల్లో మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. దీంతో ట్రెండింగ్లో దూసుకెళ్లింది. ఈ పాట అన్ని బాషల అభిమానులకు ఆకట్టుకుంది.

కాగా.. 'సామజవరగమన' పాటను పారిస్‌లో చిత్రీకరించారు. ఈ వీడియో సాంగ్‌లో బన్నీ స్టైల్, పూజా హెగ్డే అందం ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంది. 'సామజవరగమన' పాటకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఈ నేపథ్యంలో ఆ పాటకు సంబంధించిన ఫుల్‌ వీడియోను ఆదివారం చిత్రబృందం సోషల్‌మీడియా విడుదల చేసింది. ఒకసారి ఈ పాటను మీరు చూడండి.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories