సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్న 'సామజవరగమన' పాట

సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్న సామజవరగమన పాట
x
Highlights

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సినిమా అంటే ఒకరకమైన ఉత్సుకత ఉంటుంది. ఇప్పుడు అయన చేస్తున్న తాజా సినిమా అల వైకుంఠపురములో.. మాటల మాంత్రికుడు.. స్క్రీన్ ప్లే తాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకుడు. వీరిద్దరి కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. మామూలుగానే అల్లు అర్జున్ సినిమాలో పాటలకు ఓ ప్రత్యేకత ఉంటుంది. ఇప్పుడు ఈ అల లో కూడా అలాంటి పాటలే ఉంటాయట. మొదటి పాట ఇప్పుడు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.

స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, డైరెక్టర్‌ త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ వస్తున్న హ్యాట్రిక్‌ ఫిల్మ్‌ అల వైకుంఠపురములో. ఈ సినిమా నుంచి 'సామజవరగమన' అంటూ సాగే పాటను సోషల్‌ మీడియా వేదికగా చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. తమన్‌ ఈ సినిమాకు మ్యూజిక్‌ అందిస్తున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి రచించిన ఈ పాటను సింగర్‌ సిద్ధ్‌ శ్రీరామ్‌ తన గాత్రంలో అలరించారు. ఇటీవలే విడుదలైన టీజర్‌తో ఈ మెలోడీ సాంగ్‌ సోషల్‌ మీడియాలో సందడి చేయగా, తాజాగా సామజవరగమన ఫుల్‌ సాంగ్‌ సంగీత ప్రియులను ఆకట్టుకుంటోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories