'అల.. నుంచి 'సిత్తరాల సిరపడు' లిరికల్‌ వీడియో సాంగ్ రిలీజ్

అల.. నుంచి సిత్తరాల సిరపడు లిరికల్‌ వీడియో సాంగ్ రిలీజ్
x
Ala vaikunthapurramuloo
Highlights

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం 'అల.. వైకుంఠపురములో.. '.

స్టైలీష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం 'అల.. వైకుంఠపురములో.. '. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న విడుదలై బాక్సాఫీస్‌ వద్ద సూపర్ హిట్ సాధించింది. నిర్మాతలకు కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. మరోవైపు ఓవర్సీస్‌లో సైతం కనివిని ఎరుగని రీతిలో మంచి వసూళ్లు రాబడుతోంది. బన్నీ- త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్ర కావడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతే కాకుండా చాలా కాలం తర్వాత అల్లు అర్జున్ విజయం దక్కడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

కాగా.. ఇదే సమయంలో 'అల.. వైకుంఠపుమరములో..' సినిమా అభిమానులకు సినిమా బృందం మరో గిఫ్ట్ అందించింది. ఈ సినిమాలో "సామజవరగమన', "రాములో రాములా", "బుట్టబొమ్మ" తోపాటు వచ్చిన పాటలు సూపర్ హిట్ సాధించాయి. సంగీత ప్రియులను మెప్పించింది. ఆడియోలో దాచిన పాట 'సిత్తరాల సిరిపడు' థియేటర్‌లో ప్రేక్షకుల చేత కేకలు పెట్టిచింది. అయితే తాజాగా 'సిత్తరాల సిరిపడు' పాటకు సంబంధించి లిరికల్‌ వీడియోను సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. థీయేటర్ లో ఈలల వేయించిన ఈ పాట నెట్టింట్లో కూడా చక్కర్లు కొడుతోంది. 'ఆల.. వైకుంఠపురములో' మ్యూజికల్‌ హిట్‌గా నిలిచిన ఈ సినిమా నుంచి మరో అద్భుత సాంగ్ చేరిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

'సిత్తరాల సిరిపడు' ఎస్ ఎస్ తమన్‌ బాణీల్లో నుంచి వచ్చిన ఈ పాటను శ్రీకాకుళం జిల్లాకు విజయ్‌కుమార్‌ రచించారు. సూరన్న, సాకేత్‌లు గానం ఆలపించారు. విజయ్‌కుమార్‌ లిరిక్స్‌ ఫోన్లో అందించారని, తమన్ 30 నిమిషాల్లో ఈ పాట కంపోజ్ చేశారని తివిక్రమ్ చెప్పారు. శ్రీకాకుళం యాసలో సాగిన ఈ పాట ఉత్తరాంధ్ర ప్రజలకు ఆకట్టుకుంది. దీంతో ఈ పాటను వారికి అంకితమిస్తున్నట్లు దర్శకుడు తివిక్రమ్ పేర్కొన్నారు. ఈ సినిమాలో‎ అల్లు అర్జున్‌ సరసన పూజాహెగ్డే హీరోయిన్‌గా నటించారు. తెలుగు చిత్రాల్లో కొంత కాలం గ్యాప్ తర్వాత టబు ఈ సినిమాలో ఎంట్రీ ఇచ్చారు. యంగ్ హీరో సుశాంత్‌, నివేదా పేతురాజు, సునీల్‌, నవదీప్‌ కీలక పాత్రల్లో నటించారు. అల్లు అరవింద్, రాధాకృష్ణ సంయుక్తంగా చిత్రాన్ని నిర్మించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories