విజిల్ ఒక్కటే సరిపోదు.. 'అల వైకుంఠపురములో' .. ట్రైలర్ వచ్చింది

విజిల్ ఒక్కటే సరిపోదు.. అల వైకుంఠపురములో .. ట్రైలర్ వచ్చింది
x
Highlights

అలవైకుంఠపురంలో ట్రైలర్ వచ్చింది. ఈ ట్రైలర్ రెస్పాన్స్ చూస్తే ప్రేక్షకులు అమితంగా ఆక్టుకుంటోంది.

అల్లు అర్జున్ కథానాయకుడుగా నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో ... త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించాడు. పూజా హేగ్దే కథానాయకగా నటించింది. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాకి గాను సెన్సార్ బోర్డు U /A సర్టిఫికెట్ ని జారీ చేసింది. సంక్రాంతి పండగకి కానుకగా జనవరి 12 న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సినిమాని గీతా ఆర్ట్స్ , హారిక హాసిని క్రియేషన్స్ కలిసి సంయుక్తంగా నిర్మించాయి. థమన్ సంగీతం అందించాడు.

ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ కి ఎక్కడ లేని క్రేజ్ ఏర్పడింది. ముఖ్యంగా సామజవరాగమనా , రాములో రాములా, బుట్టబొమ్మా సాంగ్స్ అయితే ప్రేక్షకులను వీపరీతంగా ఆకట్టుకొని రికార్డుల మీదా రికార్డులను సృష్టిస్తున్నాయి. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ ని మొదలు పెట్టింది . అందులో భాగంగానే జనవరి 6 సోమవారం మ్యూజికల్ ఈవెంట్ ని యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్ లో నిర్వహించారు.

ఇక ట్రైలర్ విషయానికి వస్తే త్రివిక్రమ్ తన మార్క్ డైలాగులను ట్రైలర్ చూపించారు. అందరూ ఊహించినట్లుగానే ట్రైలర్ ఆసక్తికరంగా ఉంది. ఈ ట్రైలర్‌లో అల్లు అర్జున్ ఇంట్రాడాక్షన్ బాగుంది. ఈ ట్రైలర్ లో హీరో తండ్రి మురళి శర్మ మనది మిడిల్ క్లాస్ అటు గుర్తు చేస్తాడు. అల్లుఅర్జు్న్ చిన్నప్పటి నుంచి నాలైఫ్ లో ఆహా అనే రోజు లేదు అంటూ చెప్పే డైలాగ్ చాలా సింపుల్ గా ఉంటుంది. ఆ తర్వాత నిజం చెప్పేప్పుడే భయమేస్తుంది చెప్పకపోతే ఎప్పుడూ భయమేస్తుంది.. అనే డైలాగ్ త్రివిక్రమ్ మార్కును గుర్తు చేస్తుంది. ఇక ట్రైలర్ లో సినీయర్ హీరోయిన్ టబుని అల్లుఅర్జున్ మధ్య సన్నీవేశాలు ఉన్నాయి. ఇక మరో డైలాగ్ దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది సార్... ఒకటి నేలకి, రెండు వాళ్లకి. అలాంటోళ్లతో మనకి గొడవేంటి సార్... జస్ట్ సరెండర్ అయిపోవాలంతే అని చెప్పే డైలాగ్ అదర్భుతంగా ఉంది. ఈ ట్రైలర్ లో అల్లు అర్జున్ మిడిక్లాస్ అబ్బాయిలా కనిపిస్తు్న్నారు. ఇందులో అదిరిపోయే యాక్షన్ సీన్స్ ఇరగదీశాయి. అయితే మారోసారి త్రివిక్రమ్ , బన్ని కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి.



Show Full Article
Print Article
Next Story
More Stories