'అల వైకుంఠపురములో' 26 డేస్ కలెక్షన్ రిపోర్ట్

అల వైకుంఠపురములో 26 డేస్ కలెక్షన్ రిపోర్ట్
x
అల వైకుంఠపురములో
Highlights

అల వైకుంఠపురములో’ సినిమా కలెక్షన్ల హవా ఏమాత్రం తగ్గడం లేదు.

స్టైలిస్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'అల.. వైకుంఠపురములో'.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్,గీతా ఆర్ట్స్ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్. రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మించారు. ఇందులో అల్లు అర్జున్ సరసన పూజా హేగ్దే కథానాయకగా నటించింది. సంక్రాంతి కానుకగా జనవరి 12 న రిలీజైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకొని త్రివిక్రమ్,బన్ని కాంబినేషన్ లో హ్యట్రిక్ హిట్ మూవీగా నిలిచింది. ఈ సినిమా నైజాం, ఓవర్సీస్, కర్ణాటకలో తప్ప మిగిలిన అన్ని చోట్లలో ఇప్పటికే బాహుబలి ఫస్ట్ పార్ట్ కలెక్షన్లును దాటేసింది.

కాగా..'అల వైకుంఠపురములో' సినిమా కలెక్షన్ల హవా ఏమాత్రం తగ్గడం లేదు. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత కొత్త సినిమాలు వస్తున్నప్పటికీ, ఈ చిత్రానికి మాత్రం కలెక్షన్లు తగ్గడం లేదు. ఉదయం, మ్యాట్నీ షోలు కాస్తా డల్‌గా ఉన్నప్పటికీ.. ఈవెనింగ్ షోల విషయంలో ప్రేక్షకులతో థియేటర్లు కళకళాడుతున్నాయి. అయితే ఇప్పటికే ఈ సినిమా 250 కోట్ల గ్రాస్ మార్క్ ను కూడా దాటేసిన సంగతి తెలిసిందే.

ఈ చిత్రం ప్రిరిలీజ్ 85 కోట్ల బిజినెస్ జరిగింది. విడుదలైన ఆరు రోజుల్లోపే బ్రేక్ ఈవెన్ పాయింట్ సాధించిన చిత్రంగా నిలిచింది. కాగా.. 26 రోజులు పూర్తయ్యేసరికి తెలుగు రాష్ట్రాల్లో 126.64 కోట్ల షేర్‌ను రాబట్టింది. ఇక ప్రపంచవ్యాప్తంగా రూ.156.62 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. దాదాపు 250.45 కోట్ల రూపాయల గ్రాస్‌ను సాధించింది. క్లోజింగ్ కలెక్షన్లు సమయానికి ఈ చిత్రం 165 కోట్ల షేర్‌ను రాబట్టే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఒక వారం పాటు ఈ సినిమా నడిచే అవకాశం ఉంది కాబట్టి కలెక్షన్లు పెరిగే అవకాశం ఉంది. అయితే శర్వానంద్ నటించిన జాను సినిమా హిట్ కావడంతో ఈ సినిమా వసూళ్లు తగ్గే అవకాశం లేకపోలేదు.

'అల వైకుంఠపురములో..' 26 రోజుల కలెక్షన్స్ చూస్తే..

నైజాం రూ. 43.40 కోట్లు

సీడెడ్ రూ. 17.96 కోట్లు

కృష్ణా రూ. 10.51 కోట్లు

గుంటూరు రూ. 10.89 కోట్లు

నెల్లూరు రూ. 4.56 కోట్లు

ఉత్తరాంధ్ర రూ. 19.40 కోట్లు

ఈస్ట్ రూ. 11.16 కోట్లు

వెస్ట్ రూ. 8.76 కోట్లు

రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 11.74 కోట్లు

ఓవర్సీస్ రూ. 18.24 కోట్లు

వరల్డ్ వైడ్ టోటల్ రూ. 156.62 కోట్లు

Show Full Article
Print Article
More On
Next Story
More Stories