
ఈ చిత్రాన్ని జనవరి 12ను విడుదల చేయాలని చిత్ర బృందం గతంలో ప్రకటించింది
జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, హీరో అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'అల..వైకుంఠపురములో..' .ఈ చిత్రంలలో పూజా హేగ్దే కథానాయకగా నటిస్తోంది. ఈ సినిమాలో గ్లామరస్ నటీ టబు లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలకి ఎక్కడలేని క్రేజ్ వస్తోంది. ఇప్పటికే విడుదలైనా సాంగ్స్, టీజర్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా సామజవరగమన, రాములో రాములా సాంగ్స్ రికార్డులు సృష్టిస్తున్నాయి.
అయితే ఈ చిత్రాన్ని జనవరి 12ను విడుదల చేస్తున్నట్లుగా చిత్ర బృందం గతంలో ప్రకటించింది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ముందే రానున్నట్లు సమాచారం. అల వైకుంఠపురంలో..'ను జనవరి 10న తేదినే విడుదల చేయాలని దర్శక నిర్మాతలు భావించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ పనులు దాదాపుగా పూర్తి కావడంతో ముందుగానే రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం. అయితే దీనిపై త్వరలోనే అధికారికంగా ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తుంది. జనవరి 9న రజనీ కాంత్ దర్బార్, 10న 'అల వైకుంఠపురములో', 11న సరిలేరు నీకెవ్వరు.. తర్వాత ఎంతమంచివాడవురా సినిమాలు వరుసగా విడుదల కానున్నాయి.
కాగా..సామజవరగమన పాట సంగీత ప్రియులను అలరించింది. అంతేకాడు ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్ సాధించిన పాటల్లో ఇది మొదటి స్థానంలో ఉంటుంది. తాజాగా ఈ పాట లిరికల్ వీడియో వంద మిలియన్ల మంది వీక్షించారు. తమన్ బాణీల నుంచి వెలువడిన ఈ సాంగ్ గీతగోవిందం, నిన్నుకోరి వంటి చిత్రాల్లో పాటలను ఆలపించిన యువగాయకుడు సిద్ధ్ శ్రీరామ్ సామజవరగమనా పాటను ఆలపించారు. ఈ పాటను సాహిత్యాన్ని సిరివెన్నెల అందించారు.
ఈ సినిమాలో యువ కథానాయకుడు సుశాంత్, నవదీప్, నివేదా పేతురాజ్, జయరామ్‌లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రెండు వారాల్లో విడుదల కానున్న ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహించే పనిలో చిత్ర యూనిట్ బీజీగా ఉంది.

About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire




