రికార్డ్స్ టెంపరరీ.. ఫీలింగ్స్ శాశ్వతం .. బన్నీ ఎమోషనల్ స్పీచ్

రికార్డ్స్ టెంపరరీ.. ఫీలింగ్స్ శాశ్వతం .. బన్నీ ఎమోషనల్ స్పీచ్
x
అల్లు అర్జున్ , త్రివిక్రమ్
Highlights

అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి...

అల్లు అర్జున్ హీరోగా నటించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో.. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కిన చిత్రం బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సక్సెస్ మీట్ విశాఖలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ , దర్శకుడు త్రివిక్రమ్, హీరోయిన్ పూజా హెగ్డే పలువురు చిత్ర యూనిట్ పాల్గొన్నారు. విశాఖలో జరిగిన ఈ విజయోత్సవ వేడుకలకు అల్లుఅర్జున్ అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

ఈ సందర్భంగా మాట్లాడిన దర్శకుడు త్రివిక్రమ్ మాట్లాడుతూ.. వైజాగ్‌తో మంచి అనుబంధం ఉందని, రావిశాస్త్రి, శ్రీశ్రీ, చలం లాంటి రచయితల ప్రస్థానం ఇక్కడి నుంచే మొదలైందని త్రివిక్రమ్ అన్నారు. మంచి సినిమాను ప్రేక్షకులు ఎప్పటికీ ఆదరిస్తారని మరోసారి నిరుపించారని, అల్లు అర్జున్‌ కోసమే కథ పుట్టిందన్నారు. ఈ సినిమా విజయంలో బన్నీది ముఖ్యపాత్ర అని త్రివిక్రమ్ అన్నారు. అల్లు అర్జున్ తెలుగు సినిమాను ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని చెప్పారు. సినిమా విజయంలో ప్రతి ఒక్కరి పాత్ర మరిచిపోలేనిదని, త్రివిక్రమ్ చెప్పారు.

అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ.. విశాఖ తనకు ప్రత్యేకమని తెలిపారు. విశాఖ తనకు కంచుకోటలాంటిదని అన్నారు. హారికా హాసిని బ్యానర్ లో మూడో సినిమా చేశామని తెలిపారు. నా జీవితంలో మొదటి సారి త్రివిక్రమ్ మంచి బహుమతి ఇచ్చారని, ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు నటన బాగుందని ప్రశంసలు ఇచ్చారన్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో ఇండస్ట్రీకి ఆల్ టైమ్ హిట్ ఇచ్చినందుకు గర్వంగా ఉందని తెలిపారు. అభిమానులు అందరికి ఉంటారు..కానీ నాకు మాత్రం ఒక ఆర్మీ ఉంది. కొత్త సంవత్సరంలో నా చిత్రం ఆదరించినందుకు ప్రేక్షకులకు ప్రత్యేక ధన్యవాదాలు. రికార్డులు శాశ్వతం కాదని, తాత్కాలికం మాత్రమేనని అన్నారు. కానీ, అభిమానుల మనస్సులో స్థానం ఉండడం గొప్ప విషయం అన్నారు. అభిమానుల ప్రేమకు ప్రత్యేక ధన్యవాదాలని తెలిపారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి ప్రత్యేక హీరో అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories