న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. ట్రెండ్ అవుతున్న సామజవరగమన వీడియో సాంగ్

న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. ట్రెండ్ అవుతున్న సామజవరగమన వీడియో సాంగ్
x
Samajavaragamana Video
Highlights

సామజవరగమన పాట సంగీత ప్రియులను అలరించింది. అంతేకాడు ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్ సాధించిన పాటల్లో ఇది మొదటి స్థానంలో ఉంటుంది.

జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి సినిమాల తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, హీరో అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'అల..వైకుంఠపురములో..' .ఈ చిత్రంలలో పూజా హేగ్దే కథానాయకగా నటిస్తోంది. ఈ సినిమాలో గ్లామరస్ నటీ టబు లాంగ్ గ్యాప్ తర్వాత తెలుగులోకి రీఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పాటలకి ఎక్కడలేని క్రేజ్ వస్తోంది . ముఖ్యంగా సామజవరగమన, రాములో రాములా సాంగ్స్ రికార్డుల మీదా రికార్డులు సృష్టిస్తున్నాయి.

సామజవరగమన పాట సంగీత ప్రియులను అలరించింది. అంతేకాడు ఈ సంవత్సరం బిగ్గెస్ట్ హిట్ సాధించిన పాటల్లో ఇది మొదటి స్థానంలో ఉంటుంది. తాజాగా ఈ పాట లిరికల్ వీడియో వంద మిలియన్ల మంది వీక్షించారు. తమన్‌ బాణీల నుంచి వెలువడిన ఈ సాంగ్ గీతగోవిందం, నిన్నుకోరి వంటి చిత్రాల్లో పాటలను ఆలపించిన యువగాయకుడు సిద్ధ్ శ్రీరామ్ సామజవరగమనా పాటను ఆలపించారు. ఈ పాటను సాహిత్యాన్ని సిరివెన్నెల అందించారు.

ఇప్పటికే టాప్‌లో ట్రెండ్ అవుతున్న సామజవరగమనా పాట వీడియో ప్రోమోను చిత్ర బృందం విడుదల చేసింది. ఒక నిమిషం నిడివి కల ఈ ప్రోమో న్యూ ఇయర్‌ కానుకగా రిలీజ్‌ చేశారు. ఈ ప్రొమో చూస్తే.. పారిస్‌లోని అందమైన లోకేషన్‌లో దీనిని చిత్రీకరించారు. అల్లుఅర్జున్ స్టైలింగ్‌తో పాటు డాన్స్‌ మూవ్స్‌ పాటకు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.

అల్లు అర్జున్‌ సంవత్సరం గ్యాప్ తర్వాత చేస్తున్న సినిమా కావటంతో ప్రేక్షకులల్లో భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. అల్లు అరవింద్‌, రాధాకృష్ణలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. త్రివిక్రమ్ బన్ని కాంబినేషన్ లో వస్తున్న మూడో చిత్రం కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఇటీవలే షూటింగ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల రిలీజ్ కానుంది.

ఈ సినిమాలో యువ కథానాయకుడు సుశాంత్‌, నవదీప్‌, నివేదా పేతురాజ్‌, జయరామ్‌లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రెండు వారాల్లో విడుదల కానున్న ఈ చిత్రం ప్రమోషన్‌ కార్యక్రమాలను కూడా నిర్వహించే పనిలో చిత్ర యూనిట్ బీజీగా ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories